CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. హైదరాబాద్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్
- గ్రేటర్ హైదరాబాద్ సిటీ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్
- ఏర్పాటుకు అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి
- వివిధ దేశాల్లోని బెస్ట్ పాలసీని పరిశీలించి రిపోర్ట్ అందించాలని ఆదేశించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : గ్రేటర్ హైదరాబాద్ సిటీ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. వివిధ దేశాల్లోని బెస్ట్ పాలసీని పరిశీలించి రిపోర్ట్ అందించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని హైదరాబాద్ లో అమలు చేయాలని ముఖ్యమంత్రి తన ఆలోచనలను అధికారులతో పంచుకున్నారు. విద్యుత్ కేబుల్స్ తో పాటు అన్ని రకాల కేబుల్స్ కు అండర్ గ్రౌండ్ లోనే ఉండేలా వివిధ ప్రత్యమ్నాయాలు పరిశీలించాలని చెప్పారు.
అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం ద్వారా విద్యుత్ నష్టాలను తగ్గించడం తో పాటు విద్యుత్ చౌర్యం, ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్ అంతరాయం వంటి సమస్యలను అధిగమించవచ్చని ముఖ్యమంత్రి వివరించారు. రాబోయే వేసవిలో విద్యుత్ సరఫరా కు ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా డిస్కంలు సన్నద్ధం గా ఉండాలని చెప్పారు. శనివారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025 ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. అనంతరం విద్యుత్ శాఖ పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి జూపల్లి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జెన్ కో సీఎండీ సందీప్ సుల్తానియా , ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్,. డిస్కం సీఎండీలు ముషారఫ్, వరుణ్ రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, టీజీ రెడ్కో ఎండీ అనీల, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
గత ఏడాది మార్చి లో రాష్ట్రంలో పీక్ డిమాండ్ 15623 మెగా వాట్లకు చేరిందని, ఈ సారి 16877 మెగావాట్ల కు చేరుతుందని అంచనా వేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గరిష్ఠ విద్యుత్ డిమాండ్ అంచనాకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా కు ప్రణాళిక చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవసాయానికి, గృహ అవసరాలకు మార్చి నెలలో పీక్ విద్యుత్ డిమాండ్ ఉంటుందని , దానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ విస్తరిస్తున్నందున.. రోజు రోజుకు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా జరగాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యలు వచ్చినా వెంటనే సమీపంలోని మరో ఫీడర్ నుంచి ప్రత్యమ్నాయంగా సరఫరా చేసే వ్యవస్థను సమర్థంగా అమలు చేయాలని చెప్పారు. ఆదివాసీ గూడేలలో గృహాలకు సోలార్ విద్యుత్, సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు
అటవీశాఖ, గిరిజన సంక్షేమం శాఖతోపాటు సంబంధిత శాఖలతో సమావేశమై వీలైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలన్నారు. పూర్తి నివేదిక ఆధారంగా ఆదివాసీ గూడేలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సోలార్ విద్యుత్ అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆఫీసు లు, పాఠశాలలు, ప్రభుత్వ భవనాల పై సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కు వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపే కంపెనీ లను ఆహ్వానించి ఏ విధానం లో వారికి పనులను అప్పగించాలనే ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించాలన్నారు.
పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా ముందుకు తీసుకు వెళ్లాలని అన్నారు. పరిగి వద్ద 400 కేవీ సబ్ స్టేషన్ మంజూరయినా పదేళ్లుగా పెండింగ్ లో ఉందని.. దానికి సంబంధించిన పురోగతి నివేదికను అందించాలని అధికారులకు ఆదేశించారు. గోషామహల్ లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మించనున్న నేపథ్యంలో స్టేడియం పక్కనే ఉన్న సబ్ స్టేషన్ ను మరోవైపు తరలించాలని సూచించారు. మరింత అదనపు సామర్థ్యం తో పూర్తిగా అధునాతన టెక్నాలజీతో ఈ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!