CM Revanth Reddy : ఆడబిడ్డలకు డిసెంబర్లో చిలకపచ్చ చీరలు ఇస్తాం
- మేడారం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక: రేవంత్ రెడ్డి
- జంపన్న వాగును మోడల్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతాం
- బతుకమ్మ చీరల కమీషన్లపై సీఎం తీవ్ర విమర్శలు
- ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ములుగు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ తరఫున హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సూచికగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించడంతో పాటు నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం ప్రారంభించారు.
వనదేవతల ఆశీస్సులు.. మేడారం క్షేత్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో మేడారంలోని సమ్మక్క-సారలమ్మ ఆలయాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప, వేయి స్తంభాల ఆలయాల ఆధ్యాత్మిక శోభతో పోటీపడేలా మేడారం పుణ్యక్షేత్రాన్ని సమగ్రంగా తీర్చిదిద్దామని, రాబోయే రోజుల్లో జంపన్న వాగును కూడా మోడల్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గత పాలకులు వనదేవతల క్షేత్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.
Also Read
- Bolla Brothers : పోలీసులకు ఇన్ఫోర్మర్లు.. లోపల గంజాయి దందా.. బొల్లా బ్రదర్స్ బాగోతం
- CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
- OTR : రంగంలోకి బొత్స వారసురాలు..! అనూష పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ..!!
- Harish Rao : రేవంత్‌కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
బతుకమ్మ చీరల కమీషన్లపై విమర్శలు.. ఆడబిడ్డలకు చిలకపచ్చ చీరల కానుక
గత ప్రభుత్వ హయాంలో నిరుపేద ఆడబిడ్డలకు పంపిణీ చేసే బతుకమ్మ చీరల కొనుగోళ్లలో కూడా కమీషన్లు పిండుకున్నారని ముఖ్యమంత్రి తీవ్రంగా ధ్వజమెత్తారు. తమ పాలనలో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రాబోయే డిసెంబర్లో పండుగ కానుకగా ఆడబిడ్డలందరికీ నాణ్యమైన చిలకపచ్చ చీరలను అందజేస్తామని ప్రకటించారు.
తమిళనాడులో క్షుద్రపూజల సంస్కృతిపై నిప్పులు
ప్రతిపక్ష ముఖ్య నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందనే స్వార్థంతో సొంత చెల్లెలినే ఇంట్లో నుంచి గెంటేసిన సంస్కృతి వారిదని మండిపడ్డారు. కనీసం సొంత బిడ్డను ఇల్లు వెళ్లగొడుతుంటే అడ్డు చెప్పకుండా తండ్రి సైలెంట్‌గా ఉండిపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో పాడిపంటలు ఎండిపోయి, తీవ్ర కరువు రావాలని కోరుకుంటూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి కొందరు అఘోరాలు, క్షుద్రపూజలు చేయిస్తున్నారని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
తాజావార్తలు
-
Anil Ravipudi: వీకెండ్ కూడా వర్కింగ్ డేనే.. అనిల్ రావిపూడి టీమ్ దూకుడు మామూలుగా లేదుగా!
-
Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
-
CM Revanth Reddy : ఆడబిడ్డలకు డిసెంబర్లో చిలకపచ్చ చీరలు ఇస్తాం
-
Thyroid Symptoms: ఇంట్లోనే థైరాయిడ్ సమస్యను నిర్ధారించుకోవడం సాధ్యమేనా?
-
Yash Struggle Story: పాన్ ఇండియా స్టార్ యశ్‌కి ఇలాంటి గతమా? థియేటర్లో ఆయన చేసిన పనులు తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?