CM Revanth Reddy : విలన్లు క్లైమాక్స్‌లోనే అరెస్ట్ అవుతారు.. చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి సంచలనం
- చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతోంది
- విలన్లు క్లైమాక్స్‌లోనే అరెస్ట్ అవుతారు
- కేటీఆర్ డ్రగ్స్ కేసులోనూ విచారణ జరుగుతోంది
- బీసీ రిజర్వేషన్లపై మా వ్యూహం మాకుంది
- కేటీఆర్, లోకేష్ మీటింగ్ సంగతేంటి..?
- కేసీఆర్ సభకు రావాలి. -సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ఢిల్లీలో కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశాల అనంతరం మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. తన పాలనపై విమర్శలు చేసే ప్రత్యర్థులపై సూటిగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలపై ఘాటైన పదజాలంతో ప్రస్తావించారు.
“కేంద్రంతో చర్చలు జరుపకుంటే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి?” అని ప్రశ్నించారు సీఎం. రాష్ట్రానికి సంబంధించి పలు ముఖ్యమైన అంశాలను ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చించామని తెలిపారు. ఇండియా, పాకిస్తాన్ మధ్యే నీటి పంపిణీపై చర్చలు జరుగుతుంటే, నేను పక్క రాష్ట్రం సీఎంతో మాట్లాడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.
Also Read
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ ఎలాంటి చర్చలు జరగలేదని ప్రకటించిందని సీఎం తెలిపారు. అయితే, తాను ఇప్పటికే మూడు సమస్యలను పరిష్కరించానని పేర్కొన్నారు. మిగిలిన సమస్యలపై అధికారులు, సాంకేతిక నిపుణుల కమిటీ చర్చిస్తుందని వివరించారు. “నేను ఇంజనీర్ కాదు… సాంకేతిక అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకుంటాం” అని పేర్కొన్నారు.
“ప్రజలు నాకు అధికారం ఇచ్చారు.. రాష్ట్ర సమస్యలను కేంద్రానికి తీసుకెళ్లడం నా బాధ్యత” అని సీఎం స్పష్టం చేశారు. ఢిల్లీకి కాకుండా ఫామ్ హౌస్‌కు వెళ్తే సమస్యలు పరిష్కారం కావు అని పరోక్షంగా కేసీఆర్‌పై విమర్శలు చేశారు. నెలకు ఖచ్చితంగా రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకుంటానని హామీ ఇచ్చారు.
AP Rains Update: రైతులకు గుడ్ న్యూస్.. వారం రోజులు భారీ వర్షాలు!
ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో అసెంబ్లీలో చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. “కేటీఆర్ నాయకత్వాన్ని చెల్లెలే అంగీకరించడం లేదు. గతంలో సవాల్ విసిరితే పారిపోయారు” అంటూ తీవ్ర విమర్శలు చేశారు. “గంజాయి బ్యాచ్‌కి నేను భయపడను. భయపడి ఉంటే నేను రేవంత్ రెడ్డి అవుతానా?” అంటూ విరుచుకుపడ్డారు.
బీసీ రిజర్వేషన్లపై మా వ్యూహం మాకుందని, కేటీఆర్ డ్రగ్స్ కేసుపై, గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతుందన్నారు. విలన్లు క్లైమాక్స్ లోనే అరెస్ట్ అవుతారని, కేటీఆర్ లోకేష్ ల మీటింగ్ సంగతేంటని ఆయన ప్రశ్నించారు. కిషన్ రెడ్డికి బీసీ రిజర్వేషన్లపై సవాల్ విసిరిన రేవంత్.. ఫోన్ టైపింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో కలిసి పని చేస్తామని, కేసీఆర్ సభకు రావాలన్నారు.
తనపై ఉన్న కేసులపై హడావుడి చేయడం లేదని, చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు. “నేను హడావుడి చేస్తే మళ్లీ మీడియానే ప్రశ్నిస్తుంది” అంటూ గళమెత్తారు. బీజేపీ సీబీఐ కేసుల పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తోందని ఆరోపించారు.
రెండేళ్ల తర్వాత కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టులను మళ్లీ భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. ప్రస్తుతం 65 కార్పొరేషన్‌లను రెండేళ్ల పదవీకాలంతో నియమించామని తెలిపారు.
Indore: క్లీన్ సిటీగా ఇండోర్.. వరుసగా 8వ సారి రికార్డ్ సొంతం
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!