Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం మార్చారా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో రివర్స్ స్ట్రాటజీ అప్లయ్ చేస్తున్నారా?
ఢిల్లీ పర్యటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీకి వెళ్లడం నేరంగా మాట్లాడుతున్నారు.. కేంద్రానికి సంబంధించిన అంశాలపై కేంద్రంతోనే మాట్లాడాలన్నారు. ఢిల్లీకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్లాలి.. ఫామ్ హౌస్ కి వెళ్ళాలా? అని ఫైర్ అయ్యారు. 33, 34 సార్లు ఢిల్లీకి వచ్చానని.. 48 సార్లు వచ్చానని మాట్లాడుతున్నారన్నారు. తన ప్రియారిటి రాష్ట్రమని.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ , వివాదాలను పరిష్కరించుకోవడం ముఖ్యమన్నారు.
CM Revanth Reddy: ఢిల్లీలో కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశాల అనంతరం మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. తన పాలనపై విమర్శలు చేసే ప్రత్యర్థులపై సూటిగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలపై ఘాటైన పదజాలంతో ప్రస్తావించారు. “కేంద్రంతో చర్చలు జరుపకుంటే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి?” అని ప్రశ్నించారు సీఎం. రాష్ట్రానికి సంబంధించి పలు ముఖ్యమైన అంశాలను ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చించామని…