ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమురంభీం జిల్లా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గత రెండు రోజులుగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సర్వం సిద్ధం చేశారు. ఐదేళ్ల తర్వాత జిల్లాకు వస్తుండడంతో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటలకు ఆసిఫాబాద్‌కు రానున్న సీఎం కేసీఆర్ తొలుత కొమురం భీం చౌక్‌కు చేరుకుని.. అక్కడ కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయనకు నివాళులర్పిస్తారు.