CM KCR unveiled the BRS flag: ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు మిన్నంటాయి. ఈసీ, టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ఈ నెల 8న కేసీఆర్ కు సమాచారం పంపించిన విషయం తెలిసిందే. ఈసీ పంపిన లేఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పత్రాలపై సంతకం చేశారు. ఈ లేఖను కేసీఆర్ ఈసీకి పంపనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు తెలంగాణ భవన్ లో కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఇక నుంచి టీఆర్ఎస్ బీఆర్ ఎస్ అవుతుందన్నారు. ఇక నుంచి టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్ అవుతుంది. బీఆర్ఎస్ పేరుతో ఆ పార్టీ కార్యక్రమాలు సాగుతాయి. పార్టీ జెండాలో గులాబీ జెండాలో భారత మ్యాప్‌ను ఉంచారు.
Read also: Revanth Reddy : సోనియాగాంధీ జన్మదినం తెలంగాణకు పర్వదినం
కుమారస్వామికి కేసీఆర్ బీఆర్ఎస్ కండువా వేశారు. టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా ఆవిర్భవించడంపై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ప్రకాష్‌రాజ్‌లు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 5న టీఆర్ఎస్ పేరు మార్పు తీర్మానంలో కుమారస్వామి కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. దేశమంతటా పార్టీని విస్తరింపజేయాలని కేసీఆర్ భావిస్తున్నారని, టీఆర్ ఎస్ అని పేరు పెడితే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కష్టమని భావించారు. అందుకే టీఆర్‌ఎస్ పేరు బీఆర్‌ఎస్‌గా మారింది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ భావిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను, నేతలను కూడగట్టే పనిలో కేసీఆర్ ఉన్నారు. అనంతరం పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
Himachal Pradesh: ఓట్ల శాతంలో తేడా 0.90 మాత్రమే.. ఆ 20 వేల ఓట్లే బీజేపీ రాతమార్చాయి..