KCR Tour: నేడు 4 జిల్లాల్లో కేసీఆర్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR Tour: సీఎం కేసీఆర్ నేడు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగళ్ల వానతో పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. అదేవిధంగా పంటలు నష్టపోయి రైతులకు సీఎం భరోసా ఇవ్వనున్నారు.
తెలంగాణలో వడగళ్ల వానలు, అకాల వర్షం కారణంగా వరి, జొన్న, ఉద్యాన పంటలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. మామిడి పండు చాలా వరకు రాలిపోయి భారీ నష్టం వాటిల్లింది. లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పంట నష్టంపై అధికారులు కేసీఆర్‌కు నివేదిక ఇచ్చారు. ఇందులో భాగంగా ఇవాళ సీఎం కేసీఆర్ నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు.
Also Read
- KTR: వాటిని చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. కేటీఆర్ హాట్ కామెంట్స్.!
- Rohini Karthi 2026: రోహిణి కార్తె ప్రారంభం.. ‘రోళ్లు పగిలే ఎండలు’ అంటే ఇవేనేమో! అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
- Terrorist Arrest: మేడ్చల్‌లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
- Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
సీఎం షెడ్యూల్..
ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డుమార్గంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు బయలుదేరుతారు. అనంతరం 10.15 గంటలకు బేగంపేటలో హెలికాప్టర్ ఎక్కి ఖమ్మం జిల్లాకు బయలుదేరుతారు. ఉదయం 11.15 గంటలకు ఖమ్మం జిల్లా బొనకల్ మండలం రామాపురం గ్రామానికి చేరుకుంటారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. ఉదయం 11.45 గంటలకు రామపురం గ్రామం నుంచి హెలిక్యాప్టర్‌లో సీఎం కేసీఆర్ బయలుదేరుతారు.మధ్యాహ్నం 12.10 గంటలకు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకుంటారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.మధ్యాహ్నం 12.40కి రెడ్డికుంట తండా నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరుతారు. మధ్యాహ్నం 12.55 గంటలకు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకుంటారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అడవిరంగాపురం గ్రామం నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.55 గంటలకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకుంటారు. రామచంద్రపూర్‌లో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. మధ్నాహ్నం 2.30 గంటలకు హెలిక్యాప్టర్‌లో లక్ష్మీపురం గ్రామం నుంచి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమవుతారు. మధ్నాహ్నం 3.15 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.30గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకుంటారు.
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Delhi Capitals: భారీ మూల్యం చెల్లించుకున్నాం.. గుజరాత్, పంజాబ్ మ్యాచ్‌లను మర్చిపోలేము: డీసీ హెడ్ కోచ్
-
Nara Lokesh: మహానాడుపై క్లస్టర్ ఇంఛార్జ్‌లకు నారా లోకేష్ దిశానిర్దేశం
-
Kangana-Aishwarya Rai: ఐశ్వర్య లుక్‌పై ట్రోల్స్.. కంగనా రనౌత్ సీరియస్ వార్నింగ్
-
Best Colors for Summer Clothes: వేసవిలో ఏ రంగు దుస్తులు ధరించాలి? ఈ 3 కలర్స్ మీ శరీరాన్ని ఏసీలా చల్లగా ఉంచుతాయి!
-
IPL 2026 Playoffs: ఆర్సీబీ లేదా జీటీకే ఐపీఎల్ 2026 టైటిల్.. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్లకు కష్టమే!
ట్రెండింగ్
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!