CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు.. గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Took Important Decision In Secretariat Meeting: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో.. రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీ, తదితర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 24 నుంచి 30 వరకు గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి.. రైతుబంధు వర్తింపచేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా రైతుబంధు పొందుతున్న వారితో పాటు కొత్తగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్దిదారులతో క్రోడికరించి.. రాష్ట్రంలో మిగతా రైతులకు ఎలాగైతే రైతుబందు అందుతోందో, వీరికి కూడా అదే పద్ధతిలో రైతుబందు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Skyscrapers: ప్రపంచంలో అత్యధిక స్కైస్క్రాపర్స్ కలిగిన టాప్-10 నగరాలు
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ఇందులో భాగంగా.. ప్రభుత్వమే బ్యాంక్ అకౌంట్‌ను తెరిచి, పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లోనే రైతుబంధును జమ చేస్తుందని అన్నారు. కొత్తగా పోడు పట్టాలు అందుకునే గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖ వారికి అందజేయాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను సిఎం కేసిఆర్ ఆదేశించారు. అంతేకాదు.. పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని కేసీఆర్ తెలిపారు. అలాగే.. ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలున్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను, అర్హులైన నిరుపేదలను గుర్తించి, వారి ఇండ్ల నిర్మాణాల కోసం ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్‌ను త్వరగా తయారు చేయాలని, జూలై నెలలో గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. జులైలోనే దళితబందు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను కేసీఆర్ ఆదేశించారు.
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఆ హామీలన్ని అమలు చేస్తాం
జూన్ 14వ తేదీన వైద్య ఆరోగ్య దినోత్సవం నాడు.. నిమ్స్ దవఖానా విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. 2000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేయనున్నారు. ఇదే సమయంలో.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించేందుకు కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!