రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఆర్డీఎస్ వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో ఫోన్ లో మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే రెండు రాష్ట్రాల నీటి పంపకాల విషయంలో ఎవరికి అన్యాయం జరుగకుండా చూస్తానని చెప్పిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్… ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాయలసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించి వారం రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని కేఆర్ఎంబిని ఆదేశించారు కేంద్ర మంత్రి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్న కేఆర్ఎంబీ అధికారులు… అవసరం అయితే కేంద్ర బలగాలను రప్పించి ప్రాజెక్టు పనులు పరిశీలించాలని కేఆర్ఎంబీని గజేంద్ర సింగ్ తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో కేంద్ర పోలీసు బలగాల సహాయంతో రాయలసీమ ప్రాజెక్టుతో పాటు ఆర్డీఎస్ పనులు పరిశీలించనున్నారు కేఆర్ఎంబి అధికారులు.