వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసిన తెలంగాణ ప్రభుత్వం.. చివరకు తామే కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.. ఢిల్లీ వేదికగా కేంద్రానికి డెడ్‌లైన్ పెట్టిన తర్వాత రోజు.. కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. తామే వరి కొనుగోలు చేసేందుకు సిద్ధమై.. దానిపై ప్రకటన చేశారు.. ఇక, మరుసటి రోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి.. ఈ నేపథ్యంలో.. ఇవాళ వరి కొనుగోళ్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్..
Read Also: Congress: వరంగల్ పర్యటనకు రేవంత్, కోమటిరెడ్డి, మధు యాష్కీ..
యాసంగి వరి ధాన్యం సేకరణ జరుగుతున్న సమయంలో.. ఏర్పాట్ల తీరు.. వానాకాలం సాగు కోసం ముందస్తు ఏర్పాట్లు, వ్యవసాయ శాఖ సన్నద్ధత తదితర అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులతో చర్చిస్తున్నారు. ప్రగతి భవన్‌లో జరుగుతోన్న ఈ సమావేశంలో.. దళిత బంధు అమలు తీరు తెన్నులను కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. కాగా, రైతుల నుంచి ప్రతి గింజా కొంటామని ఇప్పటికే స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఇప్పుడు కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఇక, రూ.1960 మద్దతు ధరకు వరి కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి ధాన్యం రాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది సర్కార్.