తెలంగాణ, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గతాన్ని సమీక్షించుకోవడం, వర్తమానాన్ని విశ్లేషించుకోవడం ద్వారా మన జీవితాలను మరింత గుణాత్మకంగా మార్చుకోవచ్చని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు తన సందేశంలో పేర్కొన్నారు. యువత నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరచుకుని తమ ఆశయ సాధనకు ముందుకు సాగాలన్నారు. జీవితం పట్ల సరైన దృక్పథం, సంకల్ప శక్తి ఉంటేనే లక్ష్యసాధనలో విజయం సాధించవచ్చని ముఖ్యమంత్రి అన్నారు.
ఎన్నో అవాంతరాలు, వివక్షలను ఎదుర్కొంటూ ఎన్నో విజయాలు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. కొత్త సంవత్సరం తెలంగాణ, దేశంలోని ప్రజల జీవితాల్లో అన్ని రంగాల్లో గుణాత్మక ప్రగతికి బాటలు వేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో ప్రజాకేంద్ర రాజకీయాలకు, పరిపాలనకు బీజం పడాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో కొత్త ఆశలు, లక్ష్యాలతో ప్రజలు మరింత ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.