హైదరాబాద్ లో ఓ అమ్మాయిని వేధిస్తున్న కొరియోగ్రాఫర్ అరెస్ట్ అయ్యాడు. ఇన్ స్టాగ్రామ్ లో నకిలీ ప్రొఫైల్ క్రెయేట్ చేసి అమ్మాయి అసభ్య ఫోటోలు వీడియోలు పెడుతున్న కొరియోగ్రాఫర్.. విషయం బయటపడటంతో కొరియోగ్రాఫర్ మనిప్రకాశ్ ను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. 2020లో షార్ట్ ఫిల్మ్ లో నటించిన అమ్మాయి, అదే ఫిల్మ్ కు డైరెక్టర్ గా వ్యవహరించాడు మనిప్రకాశ్. షూటింగ్ టైంలో అమ్మాయికి తెలికుండా కొన్ని అసభ్యకర సన్నివేశాలు షూట్ చేసిన మనిప్రకాష్..ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొరియోగ్రాఫర్ తో మాట్లాడం మానేసింది అమ్మాయి. అమ్మాయి దూరం పెట్టడంతో ఫేక్ అకౌంట్ క్రెయేట్ చేసి ఆమె ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి బెదిరింపులకు దిగాడు. దీంతో విసిగిపోయిన ఆ అమ్మాయి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో కొరియోగ్రాఫర్ మనిప్రకాశ్ ను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.