రాజన్నసిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వేములవాడ రాజన్న ఆలయం వద్ద గుర్తు తెలియని దుండగులు శిశువును అపహరించారు. 28 రోజుల శిశువును అపహరించిన గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్ చెందిన లావణ్య వేములవాడ రాజన్న ఆలయం మెట్లమీద ఇద్దరు కుమారులతో కలిసి గత నాలుగు రోజులుగా ఒంటరిగా ఉంటుంది.
కుటుంబ కలహాలతో లావణ్యను వదిలి వెల్లిపోయాడు భర్త. దీంతో అదే అలుసుగా భావించిన కొందరు దుండగులు ఈఘాతుకానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి లావణ్యకు మద్యం తాగించి వేకువజామున శిశువును అపహరించినట్లు సమాచారం. బాధితురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. వరంగల్ లో అనుమానాస్పదంగా ఉన్నవారివద్ద శిశువును పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
ఇలాంటి ఘటనే 4 April 2017 లో చోటుచేసుకుంది. రాజన్న సన్నిధానంలో 11నెలల బాలుడు కిడ్నాప్ గురవ్వడం కలకలం రేపింది. అయతే కిడ్నాప్ గురైన 15 గంటల్లోనే పోలీసులు కిడ్నాప్ ఉదంతానికి తెరదించారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కురంపల్లికి చెందిన వరాల ఉమాయాదగిరిల కుమారుడు వరుణ్ తేజ తలనీలాలు సమర్పించుకుంటామని వారు రాజన్నకు మొక్కుకున్నారు. ఆ మొక్కు చెల్లించుకోడానికి ఆదివారం వారి స్వంత ఊరు నుంచి వేములవాడకు వచ్చారు.
రాత్రి ఆలయ ఆవరణలో నిద్రించారు. అర్ధరాత్రి 2గంటల సమయంలో తల్లిపక్కలో నిద్రిస్తున్న బాలుడిని గుర్తు తెలియని ఓ మహిళ ఎత్తుకొని వెళ్లింది. ఆ తర్వాత మెలుకువ వచ్చిన బాలుడి తల్లి ఉమ తన పక్కలో ఉండాల్సిన బాలుడు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును ట్రేస్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మికాంతపురం గ్రామంలో ఓ మహిళ వద్ద బాలుడి ఆచూకీ లభించినది. పోలీసులు వెంటనే ఆ బాలుడిని తీసుకుని, కిడ్నాప్‌కు పాల్పడిన ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పురుషులను అదుపులోకి తీసుకున్నారు.
Anekal Balraj: మార్కింగ్ వాకింగ్ కి వెళ్లి మృతువాత పడ్డ ప్రముఖ నిర్మాత