Chikoti praveen: ఇప్పట్లో క్యాసినో నిర్వహించే ఆలోచన లేదని, ఈడీ విచారణకు ఎప్పుడూ పిలిచినా వస్తానని వెళ్తానని చీకోటి ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. నిన్న ఈడీ అధికారులు చీకోటి ప్రవీణ్ కుమార్ ను ఏడు గంటల పాటు విచారించారు. ఈడీ విచారణ అనంతరం చీకోటి ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. థాయ్‌లాండ్‌కు ఆటగాడిగా వెళ్లానని చెప్పాడు. తాను ఆర్గనైజర్ గా థాయ్ లాండ్ వెళ్లలేదన్నారు. థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ నిర్వహించిన వారందరూ జైలులోనే ఉన్నారని తెలిపారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం క్యాసినో నిర్వహించే ఆలోచన లేదన్నారు. ఎప్పుడు పిలిచినా ఈడీ విచారణకు వెళతానని స్పష్టం చేశారు.
Read also: MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ సస్సెన్షన్ వేటు.. త్వరలో క్లారిటీ ఇవ్వనున్న బీజేపీ
చికోటి ప్రవీణ్ కుమార్ సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరుకావాలని చికోటి ప్రవీణ్‌కుమార్‌కు ఈడీ అధికారులు గతవారం నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 1న ప్రవీణ్ కుమార్ అనే థాయ్ లాండ్ లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు చీకోటి ప్రవీణ్‌కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. చికోటి ప్రవీణ్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో కూడా చికోటి ప్రవీణ్‌కుమార్‌ను ఈడీ అధికారులు విచారించారు. ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి 21 వరకు థాయ్‌లాండ్‌లో చీకోటి ప్రవీణ్ కుమార్ గ్యాంబ్లింగ్ నిర్వహించారు. ఏప్రిల్ 27 నుంచి మే 1 వరకు జరిగిన రెండో విడత జూదంలో చేకోటి ప్రవీణ్ కుమార్ సహా 83 మందిని థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో చికోటి ప్రవీణ్ కుమార్ సహా పలువురికి బెయిల్ మంజూరైంది. థాయ్‌లాండ్‌లో జూదానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు చేకోటి ప్రవీణ్‌కుమార్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్‌పై నిషేధం విధించిన విషయం తనకు తెలియదని చేకోటి ప్రవీణ్ కుమార్ గతంలో మీడియాతో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు.