MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ సస్సెన్షన్ వేటు.. త్వరలో క్లారిటీ ఇవ్వనున్న బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు త్వరలో ఉపశమనం లభించనుంది. త్వరలోనే తమ పార్టీ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తుందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆయనపై సస్పెన్షన్ ఉపసంహరణ ప్రక్రియపై చర్చిస్తున్నట్లు తెలిపారు. అంతిమంగా పార్టీయే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సస్పెన్షన్ ఉపసంహరణ సభలో తాను కూడా పాల్గొంటానని, ఈ విషయమై అన్ని విధాలుగా ఆలోచించి హైకమాండ్‌కు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు.
గత ఏడాది ఆగస్టులో మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఆయనను సస్పెండ్ చేసింది. రాజా సింగ్‌ను ఎందుకు బహిష్కరించకూడదో వివరించాలని బీజేపీ కోరింది. నగరంలోని ప్రముఖ హాస్యనటుడు మునవర్ ఫరూఖీ షో సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ యూట్యూబ్‌లో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రవక్త ముహమ్మద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ వర్గం ఆరోపిస్తోంది. ఈ మేరకు నగర పరిధిలోని పలు స్టేషన్లలో ఎమ్మెల్యే రాజాసింగ్ పై పలువురు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నగరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజాసింగ్ తమ మనోభావాలను దెబ్బతీశారని ఆందోళనకారులు ఆరోపించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్టు చేశారు.
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ఇక తాజాగా తెలంగాణ బీజేపీ అధిష్టానం తీరుతో విసిగిపోయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలుగుదేశంలో చేరే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. అయితే రాజా సింగ్ బీజేపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు ఇటీవల వస్తున్న వదంతులపై రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. తాను టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని రాజాసింగ్ కొట్టిపారేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీజేపీ నుండే గోషామహల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నా మెంటాలిటీ కి బీజేపీ తప్ప ఏ పార్టీ లు షూట్ కావు… ఎవరు తీసుకోరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోకి వెళ్ళలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. నా మీద సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తెస్తారో తెలియదన్నారు. బండి సంజయ్, కేంద్ర మంత్రులు ,బీజేపీ నేతలు నా వెనుక ఉన్నారని రాజాసింగ్ తెలిపారు.
WhatsApp Chat Lock: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక మరింత భద్రత..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!