Chandrayanagutta Flyover Launch Postponed: ఓల్డ్ సిటీ లో మంత్రి KTR పర్యటన రద్దు చేశారు అధికారులు. చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ప్రారంభం వాయిదా వేసుకున్న KTR స్వయంగా వాయిదా వేశారు. బీజేపీ నేతల అరెస్ట్ , ఆందోళనల నేపథ్యంలో చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ఓపెనింగ్ ను అధికారులు వాయిదా వేసారు. బీజేపీ నేతలు అడ్డుకుంట్టారన్న సమాచారంతో చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ప్రారంభం ఆగస్టు 27న ప్రారంభించనున్నట్లు సమాచారం.
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద నిర్మించిన చాంద్రాయణగుట్ట ఫ్లైఓవరు మంత్రి కేటీఆర్ ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. రూ.45.90 కోట్లతో 674 మీటర్ల పొడవునా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించగా.. ఈ ఫ్లెఓవర్ ద్వారా చాంద్రాయణగుట్టలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. SRDP ఫలాలు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజల మౌలిక అవసరాలు పూర్తి చేయడంలో బల్దియా లక్ష్యం నెరవేరే అవకాశం దగ్గరలోనే ఉంది. ఈచాంద్రాయణగుట్ట విస్తరణ ఫ్లై ఓవర్ వలన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఎల్బీనగర్ మీదుగా నల్గొండ, వరంగల్ వెళ్లేందుకు సులభతరమయ్యేందుకు ఈ ఫ్లైఓవర్ దోహదపడుతుంది. ట్రాఫిక్ సమస్యను అధికమించేందుకు చాంద్రాయణగుట్ట వద్ద రూ. 45 కోట్ల 90 కోట్ల వ్యయంతో యుటిలిటీ షిఫ్టింగ్, భూసేకరణ కలిపి మొత్తం అట్టి వ్యయంతో ఫ్లై ఓవర్ ను చేపట్టారు.
ఈనేపథ్యంలో.. ఫ్లై ఓవర్ 4 లైన్లను రెండు వైపుల 674 మీటర్ల పొడవు తో నిర్మాణం చేశారు. తద్వారా కందికల్ గేట్, బర్కాస్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఆగకుండా నేరుగా ఈ ఫ్లైఓవర్ పై నుండి వెళ్లవచ్చు. ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్ అప్రోచ్ చివరిలో ట్రాఫిక్ రద్దీ నివారించడానికి ఫ్లైఓవర్ ను పొడిగించడం జరిగింది. కుడి వైపున దర్గ, డిఎల్ఆర్పి, ఎడమ వైపున మసీదు, మందిర్ ఉండడం మూలంగా వాహనదారుల ప్రమాదాలను నివారించడమే కాకుండా ట్రాఫిక్ రద్దీని తొలగించడానికి ఉపయోగపడుతుందని భావించిన నగరవాసులకు తీవ్ర నిరాస ఎదురైంది. ఈనెల 27కు ఫ్లైఓవర్ ఓపనింగ్ కు సన్నాహాలు మొదలయ్యాయి.
Tadikonda Politics : వైసీపీలో ఎమ్మెల్యేలు మారకపోతే వారినే మార్చేపనిలో అధిష్టానం