Challa Vamshi Chand Reddy: మీలా రోజుకో పార్టీ మారే రకం కాదని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎఐసిసీ కార్యదర్శి చల్లా వంశీ చందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. డీకే అరుణ ఎంఐఎం పిలిస్తే.. ఎంఐఎంలో కూడా చేరవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ అవకాశాలు ఇస్తే ఆ పార్టీని దగా చేసే దగాకోరు డీకే అరుణ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. డీకే అరుణ అంటే.. దివాళా కోరు అరుణ అంటూ ఫైర్ అయ్యారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే అలవాటు అరుణది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాన్ గల్ జెట్పిటీసీగా రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ అన్నారు. సమాజ్ వాదీ పార్టీ, టీడీపీ, కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీలో ఉన్నది డీకే అరుణ అంటూ గుర్తు చేశారు. కాంగ్రెస్ కి మోసం చేసింది డీకే అరుణ అన్నారు. నేను పుట్టింది కాంగ్రెస్ లో.. సచ్చేది కాంగ్రెస్ లోనే అంటూ చల్లా క్లారిటీ ఇచ్చారు. అరుణలా రోజుకో పార్టీ మారే రకం కాదంటూ మండిపడ్డారు. దేశం కోసం త్యాగం చేసే కుటుంబమా మీది అని అన్నారు. మీ పరపతి ఏంటో.. నా పరపతి ఏంటో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయిందని కౌంటర్ ఇచ్చారు. అరుణ బలపరిచిన అభ్యర్థికి గద్వాలలో 7 వేల ఓట్లు వచ్చాయని, తాను బలపరిచిన అభ్యర్థికి భారీ మెజారిటీ తో గెలిచారని గుర్తు చేశారు. 15 కోట్లు ఇస్తేనే పోటీ చేస్తా అని డీకే అరుణ అన్నారని నేను ప్రమాణం చేస్తా అని అన్నారు. మహబూబ్ నగర్ లో 28 వ తేదీ ఉదయం 11 గంటలకు రామాలయం వస్తా.. డీకే అరుణ నన్ను తేదీ.. ఖరారు చేయండి అన్నారని, డీకే అరుణ వచ్చి ప్రమానం చేయడానికి రావాలని సవాల్ విసిరారు.
Read also: Uttam Kumar Reddy: కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారనే భ్రమలో ఉన్నారు.. ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
చల్లా వంశీచంద్ రెడ్డి సవాలును నిన్న డికె అరుణ స్వీకరించిన విషయం తెలిసిందే.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ గా పోటీచేయడానికి డికె అరుణ 15 కోట్లు డిమాండ్ చేసిందని..శ్రీరాముడిపై ప్రమాణం చేసి నిజం నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. అంతేకాకుండా.. డికె అరుణ రాముడి పై ప్రమాణం చేస్తే తను రాజకీయ సన్యాసం చేస్తానన్న వంశీ చంద్ రెడ్డి చెప్పడంతో వైరల్ గా మారింది. దీంతో రాముడిపై ప్రమాణానానికి తాను సిద్దమేనన్న డికెఅరుణ ప్రకటించారు. వంశీచంద్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని మండి పడ్డారు. తాను జిల్లాలో ఎవరూ గుర్తు పట్టడంలేదని అన్నారు. డికె అరుణ గూర్చి మాట్లాడితే తనకు గుర్తింపు వస్తుందని వంశీ చంద్ రెడ్డి ఆరాటమన్నారు. సమయం, స్థలం మీరు చెప్పినా సరే లేదంటే నేనే టైం డేట్ ఫిక్స్ చేస్తా అంటూ డికే అరుణ తెలిపారు. నీతో పాటు ఎవరెవరిని తీసుకువస్తావో రా అని సవాల్ చేశారు. తనకు మొదటి నుండి రాజకీయ సన్యాసం అలవాటే అంటూ సెటైర్ వేశారు. నీతో పాటు నీవు చెప్పిన వారిని కూడా రాజకీయ సన్యాసానికి సిద్దం చేయి అంటూ డికె అరుణ అన్నారు.
Saindhav : ఓటీటీ స్ట్రీమింగ్ కు రానున్న సైంధవ్..స్ట్రీమింగ్ ఎందులో అంటే..?