Jana Reddy: సీఎం రేవంత్ ప్రభుత్వం పై మాజీ మంత్రి జానారెడ్డి ప్రశంశలు వర్షం కురిపించారు. నెలరోజుల పాలన చూస్తుంటే.. సంతోషంగా ఉందని అన్నారు. ప్రభుత్వం.. ప్రజా పాలన ఒరవడితో ముందుకు వెలుతుందని తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజల మధ్యన ఉందన్న భావన కల్పిస్తుందన్నారు. ఇదే ఒరవడిని కొనసాగించాలి.. మేదావులు, ప్రజాసంఘాల, పార్టీల సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకెళ్లాలని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం.. గత పరిస్థితులను వివరిస్తూ, సమస్యలు అధిగమించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇచ్చిన హామీ లను నిలబెట్టుకునేందుకు రాత్రింబవళ్ళు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. ఈ ప్రజా పాలనలో నా వంతు పాత్ర నిర్వహిస్తా అన్నారు. గతంలో నేను నాయకత్వం వహించినప్పటికి.. ఇప్పుడు పార్టీ కార్యకర్తగా పనిచేస్తా అని తెలిపారు. నా పనితీరు ప్రతి కార్యకర్తకు ఆదర్శంగా ఉండేలా పనిచేస్తా అన్నారు. నా అనుభాన్ని, సలహాలను ప్రభుత్వానికీ, ప్రజలకు ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధమే అని తెలిపారు.
Read also: Uttam Kumar Reddy: కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారనే భ్రమలో ఉన్నారు.. ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ ప్రభుత్వంపై తాను పదేళ్ల కింద చెప్పినవే ఇప్పుడు నిజమయ్యాయన అన్నారు. అప్పులు, హామీలు,, సంస్కారం, ప్రజాస్వామ్యం, ఫతకాలపై గత ప్రభుత్వాన్ని .. నేను అనాడే హెచ్చరించానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పులు, విద్యుత్ కొను గోళ్ళు భవిష్యత్ కు ప్రమాదమని నేను చెప్పింది నేడు నిజమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటునందుకు సంతోషంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ను గెలిపించి.. ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రుణం తీసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ గెలిపించడానికి ప్రతి కార్యకర్త చేసిన కృషి అద్వితీయమని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచేలా .. ఇదే స్పూర్తితో పనిచేయాలన్నారు. అత్యధిక స్థానాలు గెలిచి సోనియా గాంధీ కి కానుకగా ఇద్దామన్నారు. ప్రజలందరికీ గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Viral Video : పెళ్లికూతురు వెయిటింగ్.. మండపానికి జేసీబీలో వచ్చిన పెళ్లి కొడుకు