Yerrabelli dayaker Rao: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురంలో నుండి నూతన బీటీ రోడ్డు, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మహ్మదాపురం గ్రామంలో వ్యవసాయ రంగాన్ని ఉపాధి హామీ పథకం కింద అనుసంధానం చేయాలని జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి రెండు లక్షల పోస్ట్ కార్డులతో ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి నిరసన కార్యక్రమం ప్రారంబించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. 40 ఏళ్లు గా రాజకీయల్లో ఉన్నానని, గత ప్రభుత్వాలకన్న కేసీఆర్ ప్రభుత్వం లోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఐదు వేల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని తెలిపిన ఎకరాకు పది వేల రూపాయలు ప్రకటించిన మహానుభావుడు కేసిఆర్ అన్నారు. ఛత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్ ల్లో మోటర్లు మీటర్లు పెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వందని అన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు మోటర్లు మీటర్లు పెట్టేదిలేదు లేదని తేల్చి చేప్పిన కేసిఆర్ అని గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకం ఎందుకు మీకు కక్ష సాధింపు బడ్జెట్ లో కేటాయింపులు తగ్గించారని అన్నారు. ఉపాధి హామీ పనులకు ఎక్కడ లేని ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు. కూలీలకు గడ్డపార, తట్టలను కోత పెట్టారు, మెడికల్ కిట్ లను కూడా అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం ఎత్తి వేయాడానికి చేస్తున్న పనుల పై ప్రధాని మోడి ఈ రోజు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా హైదరాబాద్ లో షో చేయడానికి వస్తున్నారని విమర్శించారు.
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కామెంట్స్
ఎలక్షన్ సీజన్ రావడంతో కొత్త బట్టలు వేసుకుని రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని జాతీయ ఉపాధి హామీ పథకంలో చేర్చాలని ఢిల్లీ వేదికగా ఇచ్చిన హామి ఏమైందో హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. పంట నష్ట పరిహారం అంచానా వేయాడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారని తెలిపారు. 4కోట్ల 41 లక్షలతో రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకున్నామని, 70 లక్షల రుపాయల తో అంతర్గత రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు.
TSPSC Paper: ప్రియురాలి కోసం రూ.6లక్షలతో టీఎస్‌పీఎస్‌సీ పేపర్ కొన్న వ్యక్తి