NTV Telugu Site icon

BRS KTR: దురదృష్టవశాత్తు ఓడిపోయాం.. మళ్ళీ అధికారంలోకి వస్తాం..

Ktr

Ktr

BRS KTR: రాష్ట్రంలో దురదృష్టవశాత్తూ 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని, మళ్ళీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ జండాను కేటీఆర్ ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని మా ఉద్యమ నేత, మా రథసారథి పార్టీని జలదృష్యం లో ఏర్పాటు చేసారన్నారు. యెన్నో పోరాటాలతో లక్ష్యం తో తెలంగాణ సిద్ధించిందన్నారు. అధికార గర్వంతో ఉన్న ఆనాటి కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్ర సాధన కోసం కృషి చేశారన్నారు. కుట్రలు ప్రలోభాలతో ఉద్యమాన్ని ఆపాలని చూసారని తెలిపారు.

Read also: Harirama Jogaiah Letter: జోగయ్య మరోలేఖ.. ఆ నినాదం నిజం కావాలంటే.. కాపుల ఓట్లే కీలకం..

కేసిఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం, రాష్ట్ర అభివృద్ది సాధ్యం అని 2014 లో ప్రభుత్వం వచ్చిందన్నారు. యెన్నో సమస్యల పరిష్కారం కోసం పార్టీ ప్రభుత్వం రెండు పని చేశాయన్నారు. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రంలో మహారాష్ట్రలో కూడా పార్టీ విస్తరించిందని తెలిపారు. కానీ దురదృష్టవశాత్తూ 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యమన్నారు. కానీ కేసిఆర్ మీద నమ్మకం ఉంది కేసిఆర్ ను తెలంగాణ కోరుకుంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కించపర్చిన మేము కుంగిపోమన్నారు. 24 ఏళ్ళలో మాకు ఇచ్చిన గౌరవం అభిమానానికి ధన్యవాదాలన్నారు.

Read also: Ponguleti Srinivasa Reddy: ధరణి అనే దయ్యాన్ని సరిదిద్ధు తున్నాం..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలపెట్టిన ఏ పనినైనా వదలకుండా ముందుకు తీసుకుపోయిన చరిత్ర గత రెండున్నర దశాబ్దాలలో ప్రజలందరికీ తెలుసన్నారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని ముందుకు నడుస్తున్న పార్టీ భారత రాష్ట్ర సమితి అన్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు, కార్యకర్తలందరికీ.. మాకు అందరికీ మద్దతుగా నిలబడిన తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలన్నారు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కృంగిపోము ఇదే తీరుగా మా ప్రస్థానం సాగింది. భవిష్యత్తులోనూ ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటాం.. కొట్లాడుతూనే ఉంటామన్నారు.

Read also: TSRTC: భక్తులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలంకు గంటకో బస్సు..

తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అవసరం… తెలంగాణ కంటు ఉన్న ఒక ఇంటి పార్టీ టీఆర్ఎస్… తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అన్న జయశంకర్ సార్ మాటలు ఎప్పటికీ వాస్తవంగా నిలుస్తాయన్నారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పోరాడిన గులాబీ దండుకు, ప్రాణాలు అర్పించి, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వందలాది మంది తెలంగాణ అమరవీరులకు పేరుపేరునా ధన్యవాదాలన్నారు. తెలంగాణ ప్రజలందరికీ రుణపడి ఉంటామన్నారు. కేసీఆర్ చూపిస్తున్న బాటలో మరోసారి పునరంకితం అవుతామన్నారు.
Break for Marriages: బ్యాచ్ లర్స్ కు బ్యాడ్ న్యూస్.. పెళ్లి కావాలంటే 3 నెలలు ఆగాల్సిందే..