Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గట్టి కమ్‌బ్యాక్ ఇస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టించవచ్చో ‘కరుప్పు‘ చూపించింది. మూడు రోజుల్లోనే రూ. 147 కోట్ల గ్రాస్ రాబట్టి సరైన కమర్షియల్ పడితే సూర్య బాక్సాఫీస్ స్టామినా ఏంటో ఈ సినిమా ఓపెనింగ్స్ నిరూపించాయి. ఇక ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు అభిమానులు మరో విలక్షణ నటుడు చీయాన్ విక్రమ్సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
దక్షిణాది చిత్రసీమలో విక్రమ్‌కు చాలా మంచి క్రేజ్ ఉంది. ‘అపరిచితుడు’ వంటి ఇండస్ట్రీ హిట్లతో పాటు తమిళనాడు బాక్సాఫీస్ వద్ద కూడా ఎన్నో స్ట్రాంగ్ కమర్షియల్ హిట్స్, భారీ వసూళ్లు సాధించిన రికార్డు విక్రమ్ సొంతం. అపరిచితుడు సినిమాతో తెలుగులో సాలిడ్ మార్కెట్ తెచ్చుకున్న విక్రమ్ ఆ రేంజ్ హిట్ మళ్ళి చూడలేదు. శంకర్ ‘ఐ’ సినిమా ఓపెనింగ్ అదరగొట్టింది కానీ చివరికి ప్లాప్ అయింది. అయిన సరే విక్రమ్ సినిమా అంటే తెలుగులో డీసెంట్ ఓపెనింగ్ ఉంటుంది. కేవలం నటనకే పరిమితం కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మెప్పించగల సత్తా విక్రమ్ కు ఉంది. చియాన్ చేసే విభిన్న పాత్రలకు సరైన స్క్రిప్ట్ తోడైతే బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్లో కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయం. ప్రస్తుతం విక్రమ్ తన రెగ్యులర్ సినిమాల కంటే ఒక మెట్టు పైనున్న పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో కూడిన రైట్ ఫిల్మ్ కోసం చూస్తున్నారు. ఆయన మార్కెట్ రేంజ్‌కు సరిపడా సరైన కమర్షియల్ సబ్జెక్ట్ పడిన రోజున బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాదించడం సింపుల్ మ్యాటర్. సూర్య లాగే విక్రమ్ కూడా త్వరలోనే ఒక భారీ బ్లాక్‌బస్టర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేయాలని ఆశిద్దాం!
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
తాజావార్తలు
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్‌లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
-
Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్‌బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!