Bandi Sanjay: బీజేపీ శ్రేణులపై దాడులు.. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు బండిసంజయ్ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్ పై బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ నాయకులపై దాడులను నిరసనగా ఆందోళనకు పిలుపు నిచ్చారు. బండిసంజయ్. తమ నాయకులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. అయితే.. ఎమ్మల్సీ కవిత ఇంటి వద్ద కొందరు బీజేపీ నేతలు భాజపా నాయకులు నిరసన చేపట్టిన వారిని పోలీసులు అదుపులో తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. దీంతో బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ సీరియస్ అయ్యారు. బీజేపీ శ్రేణులు శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే హత్యాయత్నం కేసులు పెడతారా అని నిలదీశారు. తమ నేతలపై వారే దాడులు చేసి బీజేపీ నాయకులపై కేసులు పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. దాడి చేయడంతో.. బీజేపీ నేతలకు గాయాలవడంతో.. వారిని ఆసుపత్రికి తరలించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. ఒక లిక్కర్ స్కామ్ పై నిజాలు తేల్చెంత వరకు ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీ మద్యం పాలసీ తెలుగు రాష్ట్రాల్లో సంచలంగా మారింది.
కేంద్ర బీజేపీ నాయకులు ఈ స్కామ్ లో సీఎం కేసీఆర్ కుమార్తె కవితదే ముఖ్యపాత్ర అని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంకి నాకు ఎటువంటి సంబంధం లేదని, దర్యాప్తుకు సహకరిస్తా అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. లిక్కర్ స్కాం ఆరోపణలపై కవిత స్పందిస్తూ.. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నేను మానసికింగా కుంగిపోతానని వారు అనుకుంటున్నారని పేర్కొన్నారు.
Also Read
ఢిల్లీ మద్యం విధానంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను ఢిల్లీ బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్ట దావా వేయనున్నారు. బీజేపీఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సా పై పరువు నష్టం దావాకు వేసేందుకు కవిత సిద్దమయ్యారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కవిత కోర్టును అశ్రయించనున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులతో కవిత చర్చలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో.. లిక్కర్ స్కాం దర్యాప్తులో సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది. లిక్కర్ వ్యాపారి రామచంద్ర పిళ్ళై ఇంట్లో సీబీఊ సోదాలు నిర్వహించింది. లిక్కర్ స్కాంలో ఏ15గా రామచంద్ర పిళ్ళై, రాబిన్ డిస్టిలరీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రెండున్నరకోట్లు ఢిల్లీ పెద్దలకు ఇచ్చినట్టు ఆధారాలు వున్నాయని సీబీఐ తెలిపిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్కామ్ లింకులు బయటపడుతున్నాయి.
Priyanaka Gandhi: తెలంగాణ కాంగ్రెస్‌పై ప్రియాంక గాంధీ ఫోకస్
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!