Inter Exam Dates: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యా విధానంలో మార్పులతో పాటు పరీక్షల తేదీలను ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో కూడా ల్యాబ్స్ , ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి..
RTA Raids: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లాల్లోని పలు కీలక ప్రాంతాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Kavitha Yatra: నేటి నుంచి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట పేరుతో సుదీర్ఘ యాత్ర చేపట్టబోతున్నారు. ఈరోజు నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు నాలుగు నెలల పాటు జిల్లాల పర్యటన కొనసాగనుంది.
సిద్దిపేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అదృశ్యమయ్యారు. లెటర్ రాసిన ఐదుగురు కుటుంబ సభ్యులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. అదృశ్యమైన వారిని భార్యాభర్తలు బాలకిషన్(55), వరలక్ష్మి(50), కుమారుడు శ్రవణ్ కుమార్(30), కుమారైలు కావ్య(23), శిరీష(20) గా గుర్తించారు. వీరు పట్టణంలోని ఖాదర్‌పుర వీధిలో నివసించేవారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో ఇంట్లోనే అందరి ఫోన్లు పెట్టేసి వెళ్లిపోయారు. రెండు రోజులుగా కుటుంబ సభ్యులు ఎవ్వరు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వచ్చిన బంధువులు తాళం వేసి…
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం భారీ నష్టా్న్ని మిగిల్చింది. తాజాగా గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద కారణాలను అధికారులు గుర్తించారు. అగ్నిప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని తేల్చారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఏసీలోని కంప్రెషర్లు పేలిపోవడంతో ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. అధికారుల వివరాల ప్రకారం.. కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఏసీలను నడుపుతుండటంతో ఘటన జరిగింది.
Shadnagar Murder : షాద్‌నగర్ శివలీల (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగానే శివలీల హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి చేసుకోమన్నందుకు శివలీలను హత్య చేసిన రౌడీషీటర్ దేవదాస్ గతంలోనూ రెండు హత్యలు, అత్యాయత్నాల కేసులో నిందితుడని పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఫరూఖ్‌నగర్ మండలం పిట్టలగడ్డతండాకు చెందిన శివలీల తన భర్త మృతి చెందడంతో తన తల్లి దగ్గర ఉంటూ.. కన్హాశాంతివనంలో కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. కర్నూల్‌కు…
Attack on Officials: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్టణం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అటవీశాఖ అధికారులు అక్రమ కలప నిల్వలపై సమాచారంతో కార్డ్ ఆన్ సెర్చ్ నిర్వహించిన సమయంలో గ్రామస్తుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అధికారులపై గ్రామస్తులు దాడి చేయడంతోపాటు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఓ బీట్ ఆఫీసర్‌కు గాయాలు కావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. అటవీశాఖ అధికారులు గ్రామంలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కలప దుంగలు, ఫర్నీచర్…