Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏడి “..మహంతి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,లోకనాయకుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ నటిస్తున్నారు.ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
ఈ సినిమాను మేకర్స్ మే 9 నే విడుదల చేయాలనీ భావించిన కూడా కొన్ని కారణాల వాయిదా పడింది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో కేవలం ఒకే ఒక్క పాట ఉండనున్నట్లు సమాచారం.టాటక్కరా అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుందట..ఈ పాటలో ప్రభాస్ ,దిశా పటాని మధ్య వచ్చే స్టెప్స్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తుందని సమాచారం.ఈ సినిమాకు సంతోష్ నారాయణ్అద్భుతమైన మ్యూజిక్ బాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.