పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించారు కృష్ణంరాజు. భక్తిరస చిత్రాలలో ఎంతోమంది దేవుళ్ళ పాత్రలూ వేసి మెప్పించారాయన. అయితే… కృష్ణంరాజుకు షిర్డీ సాయి బాబా అంటే ఎంతో గురి. ఆయన తన కూతుళ్ళు ముగ్గురి పేర్ల ముందు సాయిబాబా పేరును పెట్టారు. సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి అని వారికి నామకరణం చేశారు.
కరోనా సమయంలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం వెంకటేశ్వర స్వామి, శ్రీరామాంజనేయులు తదితరుల పెన్సిల్ స్కెచెస్ గీయడం చూసి ఆయన్ని అభినందించారు కృష్ణంరాజు. దాంతో కృష్ణంరాజు సాయిబాబా భక్తులని తెలిసిన బ్రహ్మానందం ఆయన కోసం ప్రత్యేకంగా షిర్డీ సాయినాథుని స్కెచ్ గీసి గత యేడాది అక్టోబర్ లో కృష్ణంరాజుకు స్వయంగా అందచేశారు. బ్రహ్మానందం ఇచ్చిన ఆ ప్రత్యేక కానుక చూసి కృష్ణంరాజు సైతం ఎంతో మురిసిపోయారు.