BJP MLA Raja Singh: బీజేపీ గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మ వివాదంలో చిక్కుకున్నారు. మహహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే ఓ వీడియో విడుదల చేశారు. దీంతో భగ్గుమన్న ఎంఐఎం శ్రేణులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలను ఖండిస్తూ పాతబస్తీలో ఈరోజు ఉదయం చంద్రయాణాగుట్ట పోలీస్ ముందు ఎంఐఎం చంద్రయాణాగుట్ట కార్పొరేటర్లు స్టేషన్లో ఫిర్యాదులు చేసి, స్టేషన్ ఎదుటే నిరసనలు చేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం శ్రేణులు, ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే బీజేపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని అతని చట్ట పరమైన చెర్యలు తీసుకోని పీడీ యాక్ట్ నమోదు చేయాలనీ ఎమ్ఐఎమ్ నాయకులు, రియాసత్ నగర్ కార్పొరేటర్ మిర్జా సలీమ్ బేగ్, చంద్రయాణాగుట్ట ఎంఐఎం పార్టీ ఇంచార్జ్ సమద్ బిన్ అబ్దబ్ డిమాండ్ చేసారు. 24 గంటల్లో అరెస్ట్ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా వుంటుయని హెచ్చరించారు.
తనపై నమోదైన కేసులపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్.. రాముడిని కించపరుస్తూ షో చేసిన మునావర్ ఫారుఖీని హైదరాబాద్ కు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినా షో జరిపించారు. పోలీసులకు ముందే దండం పెట్టి వేడుకున్నా వినలేదని, రాముడిని కించపరిచిన వ్యక్తికి పోలీసలు ఎలా రక్షణ కల్పిస్తారని ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. మునావర్ ఫారుఖికి కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చెప్పాను, అలా చేసిన వీడియోను యూట్యూబ్ లో తొలగించారు..రెండో భాగం వీడియో త్వరలో అప్ లోడ్ చేస్తానని రాజాసింగ్ తెలిపారు. యాక్షన్ కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుందని పేర్కొన్నారు. తనపై ఎలాంటి చర్యలకు దిగిన నేను రెడీ అంటూ సంచళన వ్యాఖ్యలు చేశారు. ధర్మం కోసం నేను ఛావడానికైనా సిద్ధమని ఎమ్మెల్యే రాజాసింగ్
రాజాసింగ్ వివాదాస్పద వీడియో యూట్యూబ్ నుండి తొలగించారు అధికారులు. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తి మేరకు రాజాసింగ్ వివాదాస్పద వీడియోని యూట్యూబ్ తొలగించింది. దీనిపై స్పందించిన రాజాసింగ్ నేను రెండో వీడియో మళ్లీ పెడతానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధమని, రెండో వీడియో త్వరలోనే యూట్యూబ్ లో అప్‌లోడ్ అవుతుందని సవాల్ విసిరారు.
Mobile Prices: మొబైల్ కొనుగోలు చేసేవాళ్లకు షాక్.. త్వరలోనే పెరగనున్న ధరలు