రెండు ఏళ్ల తర్వాత మీరు కోరుకున్న బీజేపీ ప్రభుత్వం వస్తే జీవో 317 లో బొంద పెడతాం అని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగులకు మద్దతుగా వరంగల్ సభలో బండి సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్‌ను అరెస్టు చేస్తే బీజేపీ కార్యకర్తలు భయపడిపోతారని ముఖ్యమంత్రి అనుకున్నారని, కానీ బీజేపీ కార్యకర్తలు భయపడరని బండి సంజయ్ అన్నారు. మాకు జైలు కొత్త కాదు ఇప్పటికి ఎనిమిది సార్లు వెళ్లాం. రాష్ట్ర ముఖ్యమంత్రిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎక్కడ ఉన్నా నిన్ను.. నీ కుటుంబాన్ని వదిలిపెట్టం జైలుకు పంపుతామన్నారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను ఇంకా ఇబ్బంది పెట్టాలి. వీళ్ళందరూ సహకరిస్తేనే తెలంగాణ వచ్చింది తెలంగాణ ఉద్యోగులను ఎందుకింత వేధిస్తున్నారన్నారు. ఉద్యోగం వచ్చి స్థానికత కోల్పోయి ఏడుస్తుంటే కళ్లకు నీళ్లు వస్తున్నాయన్నారు. ఇందుకోసమే తెలంగాణ తెచ్చుకుంది అని ప్రశ్నించారు. సీనియర్లు జూనియర్లు పేరుతో ఉద్యోగుల్లో కొట్లాట సీఎం పెట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో ఏ ఒక్క ఉద్యోగి సంతోషంగా లేరని విమర్శించారు. ఉద్యోగులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం బెదిరిస్తుందన్నారు.
ఇప్పటికీ మానసిక క్షోభతో ఎనిమిది మంది చనిపోయారు. ఇంకా ఎంతమంది మరణిస్తే మీకు మనస్సు కరుగుతుందని ప్రశ్నించారు.Covid నిబంధనలను అనుసరించి దీక్ష చేస్తే అక్రమ అరెస్ట్ చేస్తారా మీరు.. మీకోసం మేము ఉద్యమాలు చేస్తున్నాం ఉద్యోగులెవరూ భయపడాల్సిన అవసరం లేదు మీ సమస్య పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని మీ ఆరోగ్యం ఎవ్వరూ పాడుచేసుకోవద్దు అంటూ ఉద్యోగులకు సూచించారు బండిసంజయ్. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎవ్వరూ మద్దతు తెలిపిన వారు లేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎం పార్టీ వాళ్లతో సీఎం భేటీ ఎలా అవుతారని ప్రశ్నించారు. తెలంగాణను వ్యతిరేకించింది ఎంఐఎం వామపక్ష పార్టీలని గుర్తు చేశారు. తెలంగాణలో13 జిల్లాల్లో పదో తేదీ వచ్చిన ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు రాలేదన్నారు.
Read Also: మూడేళ్లు కుంభకర్ణ నిద్రపోయిండా కేసీఆర్..? : ఈటల రాజేందర్
ఒక ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన మూర్ఖుడు సీఎం కేసీఆర్ అంటూ మండిపడ్డారు.కమ్యూనిస్టు పార్టీతో కుమ్మక్కై చైనాకు మద్దతు తెలుపుతున్నారు సీఎం.సీఎం ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గడీల పాలనను బద్ధలు కొడుతుందన్నారు. మోడీ గారు ఫోన్ చేసి చెప్పారు. ఉద్యోగుల కోసం పోరాడుతున్న కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పండి అని చెప్పారు.. ఉద్యోగుల కోసం పోరాడుతున్న తీరు అభినందనీయం అంటూ చెబుతూ కార్యకర్తలు జాతీయ నాయకత్వం అండగా ఉంది అని భరోసా ఇవ్వండి అని మోడీ గారు చెప్పారని బండి పేర్కొన్నారు.
317 జీవో ఉద్యోగులను ఎంత ఇబ్బంది పెడుతుందో అర్థమైంది: అస్సాం సీఎం, హిమంత బిశ్వశర్మ
నాకు తెలుగు అర్థం కాకపోయినా బండి సంజయ్ మాట్లాడుతున్న సందర్భంగా 317 జీవో ఎంత ఇబ్బంది పెడుతుందో నాకర్థమైందని అస్సాం సీఎం, హిమంత బిశ్వశర్మ అన్నారు. అస్సాంలో ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీలను ఇచ్చేలా చర్యలు చేపట్టాం. మరి తెలంగాణలో ఆ దిశగా చర్యలు లేవన్నారు. కేసీఆర్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మర్చిపోయాడు. ఇప్పటివరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియ సరిగా జరగడం లేదన్నారు. పోలీసులు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు వెళ్లే వాళ్ళు పోలీసులు.. మీకు మద్దతు ఇస్తున్నారా పోలీసులు నమ్ముకొని ముందుకు పోకండి జనాలని నమ్ముకొని ముందుకు సాగండి అంటూ పిలుపునిచ్చారు. ప్రజా సర్కార్‌ను నిర్వచించండి. ఫామ్‌హౌస్‌లో కూర్చున్న సీఎంకు ప్రజలు బుద్ధి చెబుతారని హిమంత బిశ్వశర్మ అన్నారు.
నిజాం రాజుగా పాలను గుర్తు చేసుకోకు.. కాకతీయ రాజుల పాలను గుర్తు చేసుకో అంటూ కేసీఆర్‌కు హిమంత బిశ్వశర్మ చురకలు అంటించారు.
Read Also: న్యూయార్క్‌లో రిలయన్స్ భారీ పెట్టుబడులు…
సర్ధార్ వల్లభాయ్ పటేల్ పాలనను గుర్తు చేసుకో.. బండి సంజయ్‌ని ఇప్పుడు అరెస్టు చేసిన అదే పోలీసులు 2023 తర్వాత మీ ఇంటికి వచ్చి అరెస్టు చేసే పరిస్థితులు రావొచ్చు అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది. సీఎం కేసీఆర్ సీపీఎం, సీపీఐ పార్టీతో మంతనాలు చేస్తున్నారట వారితో కలిసి ఏం రాష్ర్ట ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రం చేస్తున్న మంచి పనులను తెలసుకొని వెళ్లి అస్సాంలో చేద్దాం అనుకున్న కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ ఏమీ లేదని అని హిమంత బిశ్వశర్మ అన్నారు. కేవలం ఫామ్ హౌస్ పాలన నడు స్తుంది అని తెలిసి ఆశ్చర్య పోయానని తెలిపారు. బీజేపీ కార్యకర్తల వెంట కేంద్ర నాయకత్వం ఉంది. ఎవ్వరికీ భయపడకండి ప్రజల కోసం పోరాటం చేయండి అంటూ హిమంత బిశ్వశర్మపిలుపునిచ్చారు.