న్యూయార్క్‌లో రిల‌య‌న్స్‌ భారీ పెట్టుబ‌డులు…

ఇండియా జెయింట్ వ్యాపార దిగ్గ‌జం రిల‌యన్స్ అమెరికాలో భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధ‌మవుతున్న‌ది. ఇప్ప‌టికే అనేక రంగాల్లోకి ప్ర‌వేశించిన రిల‌య‌న్స్ సంస్థ తాజాగా హోట‌ల్స్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. అమెరికా ఆర్థిక రాజ‌ధాని న్యూయార్క్ న‌గ‌రంలోని మిడ్‌టౌన్ మాన్‌హ‌ట్ట‌న్ లోని మాండేరియ‌న్ ఓరియంట‌ల్ ఫైవ్ స్టార్ హోట‌ల్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ద‌మ‌యింది. 100 మిలియ‌న్ డాల‌ర్ల‌తో మాండేరియ‌న్ ఓరియంట‌ల్ హోట‌ల్‌ను కొనుగోలు చేస్తున్న‌ట్టు రిల‌య‌న్స్ సంస్థ స్ప‌ష్టం చేసింది.

Read: రమేష్ బాబుపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్

మార్చి 2022 నాటికి 100 మిలియ‌న్ డాల‌ర్ల‌ను మాండేరియ‌న్ ఓరియంట‌ల్ హోట‌ల్స్ యాజ‌మాన్యానికి చెల్లించి ఫైవ్‌స్టార్ హోట‌ల్‌ను సొంతం చేస‌సుకునేందుకు సిద్దం అవుతున్న‌ది రిల‌య‌న్స్. ఆయిల్‌, రిఫైన‌రీ, జియో వంటి అనేక రంగాల్లో దూసుకుపోతున్న రిల‌య‌న్స్ ఇప్పుడు హోట‌ల్ రంగంలోకి కూడా అడుగుపెట్ట‌డం విశేషం. ఇండియాలోనూ హోట‌ల్స్ రంగంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు రిల‌య‌న్స్ ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్న‌ట్టు స‌మాచారం.

Related Articles

Latest Articles