BSNL Diwali 2023 offers: 2023 దీపావళి పండగ కానుకగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.దీపావళి నేపథ్యంలో డేటాకు ప్రాధాన్యతనిస్తూ.. కొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌ను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్స్ ద్వారా ఎలాంటి కాలింగ్, ఎస్‌ఎమ్‌ఎస్ బెనిఫిట్స్ ఉండవు. బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన డేటా రీఛార్జ్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
BSNL 251 Plan:
దీపావళి పండగ కానుకగా బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్స్‌లో మొదటిది రూ. 251. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 70 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్‌లో ఎలాంటి కాలింగ్, ఎస్‌ఎమ్‌ఎస్ బెనిఫిట్స్ ఉండవు. కేవలం డేటా కోసం మాత్రమే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. బీఎస్‌ఎనల్ మొబైల్ యాప్ (బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్ కేర్ యాప్) ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. అదనంగా 3 జీబీ డేటా లభిస్తుంది.
BSNL 666 Plan:
దీపావళి కానుకగా బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న మరో రీఛార్జ్ ప్లాన్ రూ. 666. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. 105 రోజుల పాటు అన్‌లిమిటిడ్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఉచితంగా పొందొచ్చు. అయితే ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. ఎలాంటి డేటా లభించదు. ఐతే బీఎస్‌ఎనల్ సెల్ఫ్ కేర్ యాప్‌తో రీఛార్జ్ చేసుకుంటే 3 జీబీ డేటా వస్తుంది.
Also Read: Tamil Nadu Crime: తమిళనాడులో దారుణం.. కూతురు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని..!
BSNL 599 Plan:
బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోన్న మరో రీఛార్జ్ ప్లాన్ రూ. 599. ఈ ప్లాన్‌లో వ్యాలిడిటీ 84 రోజులు. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లతో పాటు రోజుకు 3 జీబీ డేటాను పొందొచ్చు. సెల్ఫ్ కేర్ యాప్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. అదనంగా 3జీబీ డేటా పొందొచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ నైట్ డేటాను కూడా కూడా పొందొచ్చు.
This #Diwali, grab the opportunity for extra data. Recharge with ₹251 via the #BSNLSelfCareApp and enjoy an additional 3GB of data.#RechargeNow: https://t.co/cF78luawjh (For NZ, EZ& WZ), https://t.co/izfIY0KE3G (For SZ)#BSNL #BSNLDiwaliBonanza #G20India #BSNLRecharge pic.twitter.com/Hd2xiN39Vn
— BSNL India (@BSNLCorporate) November 2, 2023