తెలంగాణ ఉద్యమకారుల మీటింగ్ అని పిలిచారు.. మేము ఆశించిన తెలంగాణ కోసం పోరాడమో.. ప్రస్తుతం అది లేదు..పక్క రాజకీయ పార్టీలాగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు బీజేపీ నేత దిలీప్ కుమార్. వేలాది కోట్లతో అన్ని రకాల వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఈటల రాజేందర్ ని ఎన్నికల్లో గెలిపించాలని ఆకాంక్షిస్తున్నాం. మేమంతా అదే ఆశిస్తున్నాం. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వారు నియంత లాగా వ్యవహరిస్తున్నారు. కుల, విద్యార్థి సంఘాలు.. ప్రజా స్వామ్యం కోరుకునే ప్రతి ఒక్కరినీ ఏకం చేయడానికి ప్రణాళిక చర్చించాం. ఈటల గెలుపు మళ్ళీ బంగారు తెలంగాణ కు పునాది వెయ్యాలి అని పేర్కొన్నారు.