Jithender Reddy: తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసి విమర్శలు కురిపిస్తున్నారు.. మోడీ హామీలు అమలు చేయకపోవడంతో పాటు.. ఆయన పాలనలో చేసింది ఏమీ లేదంటూ పదునైన పదాలతో విమర్శలు గుప్పిస్తున్నారు.. అయితే.. కేటీఆర్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ రాజకీయంలో ఓ బచ్చా అని పేర్కొన్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ చిటికెన వేలుకు కూడా కేటీఆర్ పనికి రాడు అంటూ ఫైర్ అయ్యారు.. నీ వాక్ చాతుర్యం ఎవరి మీద ప్రయోగిస్తున్నారు తెలుసుకుని మాట్లాడు అని హితవుపలికారు.. పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి ఓ సరైన డీపీఆర్ ఇచ్చారా? ఓ సారి జూరాల నుంచి.. మరో సారి నార్లపుర్ నుంచి ప్రాజెక్ట్ ను రూపొందించారు.. అనవసరంగా ఎన్ జీ టి.. కోర్టులకు వెళ్లేలా మీ చర్యలు ఉన్నాయి.. మీ అహంకార వైఖరి వల్లే ఇంత జరిగిందని మండిపడ్డారు. .
Read Also: Red Alert at Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రెడ్ అలర్ట్.. విజిటర్స్ నో ఎంట్రీ
కమీషన్ల కోసం రిజర్వాయిర్ లు కట్టారు.. మేం ఈ ప్రాజెక్టుకు జాతీయహోదా ఇప్పిస్తాం.. కానీ, మా ప్రభుత్వం వచ్చాక.. అంతేకాదు.. వచ్చేది వందకు వందశాతం మా ప్రభుత్వమే ననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు జితేందర్ రెడ్డి.. మేం ఓ పద్ధతి ప్రకారం ఈ ప్రాజెక్టును రూపొందిస్తాం.. జాతీయ హోదా సాధిస్తామని ప్రకటించారు.. నీటి వాటా కోసం అప్పట్లోనే సీఎం కేసీఆర్ 299 టీఎంసీలు చాలని ఉమా భారతి ముందు సంతకం చేశారు.. తెలంగాణకు అన్యాయం చేసిన వ్యక్తి సీఎం కేసీఆరేనని ఆరోపించారు.. ఇది, కూడా మేం కృష్ణా నీటి లో 599 టీఎంసీల నీటి కోసం మా ప్రభుత్వము వచ్చాక సాధిస్తాం అన్నారు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ అసమర్ధ ప్రధాని కాదు.. దేశంలోనే అందరికన్నా సోమరి సీఎం.. సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. నీవు కాదు ప్రధానికి సర్టిఫికేట్ ఇచ్చేది.. మొత్తం ప్రపంచం మోడీని ప్రశంసించిన సందర్భం ఉందన్నారు. రష్యా – ఉక్రెయిన్ యుద్దాన్ని మోడీ ఆపాడని గప్పాలు కొట్టారని అన్నవు.. గప్పాలు కొట్టేది సీఎం కేసీఆర్.. ఎక్కడు పోయినా గొప్పలు చెప్పుకునే స్థాయి సీఎం కేసీఆర్ ది.. ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు.. కానీ, ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించారు జితేందర్‌రెడ్డి.