టాలీవుడ్ హాట్ బ్యూటీ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ద్వారా ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత తెలుగులో పలు చిత్రాలలో నటించి మెప్పించింది.ఆ తరువాత సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ భామ పిచ్చ క్రేజ్ తెచ్చుకుంది .ఈ భామ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది .నిత్యం తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ రెచ్చగొడుతుంది.తాజాగా అషురెడ్డి తెలుగులో ”యేవం” ఓ క్రేజీ చిత్రంలో నటిస్తుంది.ఈ సినిమాలో తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తుంది.
అలాగే ఈ సినిమాలో వశిష్ఠ సింహ,జైభారత్ ,అషురెడ్డి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .ఈ చిత్రానికి ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహిస్తున్నాడు.నవదీప్ మరియు గోపరాజు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.కీర్తన శేషు ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు .రీసెంట్ ఈ సినిమాలో చాందిని చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ లో చాందిని పోలీస్ గెటప్ లో కనిపించింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి అషు రెడ్డి బోల్డ్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ చిత్రంలో అషు రెడ్డి హారిక అనే పాత్రలో నటిస్తుంది.తాజాగా రిలీజ్ చేసిన లుక్ లో ‘నా బాడీ సూపర్ డీలక్స్’ అనే కాప్షన్ ను ఉంచారు.దీనితో ఈ సినిమాలో అషు రెడ్డి బోల్డ్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం అషు రెడ్డి ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .
#AshuReddy as Ravishing Harika from the world of #Yevam 💄 pic.twitter.com/MhCWLRs2ih
— Vamsi Kaka (@vamsikaka) May 3, 2024