Telangana BJP: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ఇవాళ ఉదయం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారందరినీ కిషన్‌రెడ్డి సన్మానించారు. తెలంగాణ శాసనసభ తొలి సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సభలో చర్చించాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం కిషన్ రెడ్డి కొత్త ఎమ్మెల్యేలందరితో కలిసి చార్మినార్ దగ్గర అమ్మవారిని దర్శించుకున్నారు. మరోవైపు ప్రొటెం స్పీకర్‌గా ఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
Read also: CM Revanth Reddy: కరెంట్ సరఫరాకు అంతరాయం కలగొద్దు.. అధికారులకు సీఎం కీలక ఆదేశం
ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన అక్బరుద్దీన్ ఒవైసీ ఎదుట ప్రమాణం చేయకూడదని బీజేపీ నిర్ణయించింది. దీంతో ఎమ్మెల్యేలు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం బీజేపీ కార్యాలయానికి బయలుదేరనున్నారు. ఇవాళ ఉదయం అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనే బహిష్కరణపై క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే.. ఈ విషయంపై నిన్న (శుక్రవారం) సాయంత్రం గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తన స్టాండ్‌ను స్పష్టం చేశారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను ఎంపిక చేస్తే శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనని చెప్పారు. తన ఎమ్మెల్యేలు ఎవరూ ప్రమాణ స్వీకారం చేయరని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారా? గో అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారడంతో ఇవాళ మీడియా ద్వారా కిషన్ రెడ్డి క్లారిటీ ఇవ్వనున్నారు.
Costly Coffee : ఈ కాఫీకి ఫుల్ డిమాండ్ .. ధర ఎంతో తెలుసా?