Costly Coffee : ఈ కాఫీకి ఫుల్ డిమాండ్ .. ధర ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొద్దున్నే లేవగానే చాలా మందికి బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. గొంతులో చుక్క పడందే పొద్దు పొడవదు.. అలాంటి కాఫీని బయట కొనాలంటే 20 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది.. రకరకాల కాఫీలు మార్కెట్ లో కనిపిస్తుంటాయి.. కానీ ఒక కప్పు కాఫీ ధర రూ.6 వేలు అంటే నమ్ముతార.. అసలు నమ్మరు.. అమెరికాలో ఓ కాఫీ షాప్ చేస్తున్న కాఫీ ధర అక్షరాల ఆరు వేలు.. దాన్ని ఓ అడవి జంతువు మలంతో తయారు చేస్తారట.. దాన్ని తాగడానికి జనాలు కూడా ఎగబడుతున్నారు.. ఆ కాఫీ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ పేరు ‘కోపి లువాక్’. దీనిని సివెట్ కాఫీ అని కూడా అంటారు. ఇది సివెట్ లేదా పునుగు పిల్లి మలంతో తయారు చేస్తారు.. ఒక కప్పు సివెట్ కాఫీ కోసం వేల రూపాయలు చెల్లిస్తారు. చాలా ఆనందంగా డబ్బు ఖర్చు పెట్టుకుని మరీ కప్పు కాఫీ తాగుతుంటారు. ఎందుకంటే ఇది అత్యంత రుచికరమైనది. ఎంతో పోషకమైనది కూడా… ఎన్నో రోగాలను కూడా నయం చేస్తుందని చెబుతున్నారు కొందరు..
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఈ సివెట్ పిల్లులు కాఫీ గింజలను తినడానికి ఇష్టపడతాయి. కానీ పిల్లులు చెర్రీ గుజ్జును పూర్తిగా జీర్ణించుకోలేవు. దీనికి కారణం వాటి పేగులలో జీర్ణ ఎంజైమ్‌లు ఉండవు. అందువలన, కాఫీ ఆ భాగం పిల్లి మలంతో బయటకు వస్తుంది. అప్పుడు దాన్ని శుద్ధి చేస్తారు. అన్ని రకాల సూక్ష్మజీవులు తొలగిపోయేలా చర్యలు తీసుకుంటారు. పూర్తిగా శుద్ధి చేసిన తర్వాత తదుపరి ప్రాసెసింగ్ జరుగుతుంది. ఆ గింజలు కడిగి కాల్చిన తర్వాత కాఫీ తయారు చేస్తారు.. భారతదేశంలోని కర్ణాటక (కొడగు) జిల్లాలో ఉత్పత్తి అవుతుంది. ఆసియా దేశాలలో, ఇండోనేషియాలో ఇది పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేస్తారు. ఈ కాఫీ కిలో 20 నుంచి 25 వేల రూపాయల వరకు ఉంటుంది.. అమెరికా, అరబిక్ కంట్రీలలో వీటికి డిమాండ్ మాములుగా ఉండదు.. ఒక కప్పు ధర రూ.6 వేలు అని చెబుతున్నారు.. ఇది విన్న కొందరు కామెంట్స్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!