పాతబస్తీలో బైక్ రేసర్లు రోడ్డుపై వీరంగం సృష్టించారు. బైక్ రేసింగ్ చేస్తున్న పోకిరీలను అడ్డుకున్న యువకుడిపై దారుణానికి పాల్పడ్డాడు. బైక్ రేసర్లంతా ఏకమై యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన పాత బస్తీలోని ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పాతబస్తీలో నకిలీ నోట్ల దందా సాగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో అలర్ట్ అయిన పోలీసులు ఈ విషయంపై నిఘా ఉంచారు. నకిలీ నోట్లు మారుస్తున్నారని తెలుసుకుని ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. కాగా..ఈ దాడుల్లో రూ. 30 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.
పాతబస్తీలో అర్ధరాత్రి ఇంటి ముందు కూర్చొని ఎందుకు లొల్లి చేస్తున్నారని ప్రశ్నించిన పాపానికి 20 మంది గ్యాంగ్ కలిసి ఓ కుటుంబంపై దాడికి పాల్పడిన సంఘటన పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి చోటుచేసుకుంది బార్కాస్ ప్రాంతానికి చెందిన సల్మాన్ ఇంటి ముందు అర్ధరాత్రి న్యూసెన్స్ చేస్తున్న పొరుగు ఇళ్లకు చెందిన సయ్యద్ తారీఖ్ అతని బంధువులను సల్మాన్ వెళ్లిపోవాలని సూచించాడు…దీంతో రెచ్చిపోయిన వారు వెళ్లపో మ్మనడానికి నువ్వెవ్వరంటూ దూషించారు. అంతటితో ఆగకుండా కొద్ది సేపటి…