పాతబస్తీలో బైక్ రేసర్లు రోడ్డుపై వీరంగం సృష్టించారు. బైక్ రేసింగ్ చేస్తున్న పోకిరీలను అడ్డుకున్న యువకుడిపై దారుణానికి పాల్పడ్డాడు. బైక్ రేసర్లంతా ఏకమై యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన పాత బస్తీలోని ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.