Medico Preethi Uncle: మంత్రి హరీశ్ స్పందించాలి.. సైఫ్ ను కఠినంగా శిక్షించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medico Preethi Uncle: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా వైద్య విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. సైఫ్ వేధింపులే వల్లే ప్రీతికి ఇలాంటి దుస్తితి వచ్చిందని, సైఫ్ ను కఠినంగా శిక్షించాలని.. ఈ ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రీతి బాబాయ్ రాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. నవంబర్ లో ప్రీతి కాకతీయ మెడీకల్ కాలేజీలో జాయిన్ అయ్యిందని పేర్కొన్నారు. డిసెంబర్ నుండి వేధింపులు మొదలయ్యాయని తెలిపారు. క్యాస్ట్ పేరుతో సైఫ్ అనే విద్యార్థి ప్రీతిని వేధించేవాడని చెప్పుకొని బాధపడేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా అన్నయ్యకు చెబితే, కాలేజీ వాళ్ళతో మాట్లాడాడని, ఐనా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని బాబయ్ రాజ్ కుమార్ చెప్పుకొచ్చారు. కాలేజీ యాజమాన్యం అప్పుడే స్పందించి ఉంటే ప్రీతికి ఈగతి పట్టేది కాదని కన్నీరు మున్నీరయ్యారు. మంత్రి హరీష్ రావు చొరతీసుకుని ప్రీతి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. మరి దీనిపై మంత్రి హరీశ్ రావు స్పందిస్తారా? అనేది సంచలనంగా మారింది.
Read also: Minister KTR: నేడు భూపాలపల్లిలో కేటీఆర్ పర్యటన.. 6 ప్రారంభోత్సవాలు, 2 శంకుస్థాపనలు
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
డైవర్ చేస్తున్నారు న్యాయం చేయండి
ఆత్మహత్యయత్నం చేసుకున్న ప్రీతిని ఇవాళ వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించిన అధికారులు. మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి ప్రీతి నీ తీసుకొని వచ్చిన అధికారులు. అయితే దీనిపై మెడికో ప్రీతి తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. వైద్య చికిత్సకు ఆమె శరీరం సహకరించట్లేదని కన్నీరుమున్నీరు అయ్యారు. ఇష్యుని డైవర్ట్ చేయడానికే నిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. 20 వ తేది రాత్రి కాలేజీ దగ్గరికి వెళ్ళానని, ప్రీతి ఉన్నతాధికారులకు వేధింపులుపై చెప్పానని అన్నారు. కాని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. సీనియర్లు కదా మామూలుగా ర్యాగింగ్ ఉంటుంది అనుకున్నామని, గిరిజన యువతివంటూ అవమానపరుస్తూ వేధింపులకు గురి చేశారని తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు పాల్పడుతున్న సైఫ్ తో మాట్లాడుతానని ప్రీతికి చెప్పినా వద్దు, మళ్ళీ ఇబ్బందులు ఉంటాయని, మార్కులు తక్కువ వేస్తారు అని భయపడిందని చెప్పుకొచ్చారు. ఎంతో ధైర్యంగా ఉండేది, కరోనాలో కూడా విధులు నిర్వర్తించిందని వాపోయాడు. అలాంటి ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందంటే సైఫ్ ఎంతగా వేధీంచాడో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీకి చెడ్డ పేరు ఎక్కడో వస్తుందోనని నిమ్స్ కు తీసుకువచ్చారని కన్నీరుమున్నీరు అయ్యారు తండ్రి. మాకు న్యాయం చేయాలని, సైఫ్ ను కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని తండ్రి నరేందర్ కోరుతున్నారు.
ప్రీతి సోదరుడు..
మూడు నెలల నుంచి ప్రీతిని సీనియర్లు వేధిస్తున్నారని ప్రీతి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు. చదువు రాదని ఇష్టం వచ్చినట్లు వేధిస్తున్నారని అన్నారు. 24 గంటల పాటు డ్యూటీ చేయిస్తున్నారని, సీనియర్ల వేధింపులపై పలుమార్లు మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు గురిచేసి వారి నాన్న ఎస్ఐ కావడంతో అతని పేరు చెప్పి ప్రీతిని వేధించారని సోదరుడు ఆరోపించారు. నిన్న ఉదయం గుర్తుతెలియని ఇంజక్షన్ తీసుకొని ప్రీతి ఆత్మహత్యయత్నాలు పాల్పడిందని కన్నీరు మున్నీరయ్యాడు. ప్రస్తుతానికి ప్రీతి కోమాలో ఉందని, ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పేర్కొన్నాడు. 24 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేము అని వైద్యులు అంటున్నారని, ప్రీతి వ్యవహారాన్ని మేనేజ్మెంట్ దాచిపెట్టే ప్రయత్నం చేస్తుందని ప్రీతి సోదరుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Medico Preethi Father: ఇష్యూని డైవర్ట్ చేయడానికే నిమ్స్ కి తీసుకొచ్చారు
తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!