భూపాలపల్లిలో రాజకీయ వేడి తగ్గడం లేదు. ఇరు పక్షాలు బహిరంగ చర్చపై తగ్గేదేలే అంటున్నాయి. ఈ నేపథ్యంలో.. క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా..
హన్మకొండలోని స్వగృహంలో సత్యనారాయణ హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. చర్చకు సిద్ధమే అంటూ ఇద్దరు నేతల ప్రకటనలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి మాట్లాడుతూ.. ఆరోపణలపై చర్చకు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరాను.. 11 గంటలకు అంబేడ్కర్ సెంటర్ కు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారన్నారు. రాజకీయ నేతల మాటలకు ఓ హద్దు ఉండాలని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే అభిమానులు స్పందిస్తారన్నారు.
Also Read : Brain Eating Amoeba: ట్యాప్ వాటర్ తో ముక్కు కడుక్కుంటేనే చనిపోతారా..? అమెరికాలో ఓ వ్యక్తి మరణం..
ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోవాలని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. సత్యనారాయణ మాట్లాడుతూ.. బహిరంగ చర్చకు వెళ్లకుండా పోలీసులతో హౌజ్ అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ఎమ్మెల్యే అక్రమాలపై అన్ని ఆధారాలతో సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. చర్చకు రేవంత్ రెడ్డి అవసరం లేదు నేను సిద్ధంగా ఉన్నానని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మరోవైపు డీఎస్పీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. వ్యక్తిగత దూషణలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. నేతల సవాళ్లు ప్రతిసారి వాళ్ళతో లాండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇరువర్గాలను బయటకు రాకుండా కట్టడి చేశాం డీఎస్పీ కిషోర్ కుమార్ వెల్లడించారు.
Also Read : IND vs AUS: మూడో టెస్టులో పీకల్లోతు కష్టాల్లో భారత్.. 163 పరుగులకే ఆలౌట్