Bhatti Vikramarka: బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పాదయాత్ర శిబిరం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పూలమాలవేసి నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లాలో పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఈ దేశంలో పుట్టడం మనందరి అదృష్టమన్నారు. సామాజిక న్యాయం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారని అన్నారు. అంబేద్కర్ చూపించిన రాజ్యాంగమే ఈ దేశానికి శ్రీరామరక్ష అని తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే దేశంలో ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉన్నాయన్నారు. ప్రధాని మోడీ, అమిత్షా లాంటి నియంతృత్వ వాదులు ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతుందని భట్టి అన్నారు.
Read also: Bus Accident: మహారాష్ట్రలో బస్సు ప్రమాదం.. 14 మందికి గాయాలు
అంబేద్కర్ రాజ్యాంగ ఫలితమే కార్మిక హక్కులు కాపాడబడుతున్నాయని తెలిపారు. దేశంలో కార్మికులకు పని దినాలు, సెలవు దినాలు, పిఎఫ్, మహిళలకు సెలవులు ఉండాలని పోరాటం చేసి రాజ్యాంగంలో పొందుపరిచిన అంబేద్కర్ అని గుర్తు చేశారు. మహిళలకు సమాజంలో సగభాగం అవకాశం కల్పించింది భారత రాజ్యాంగం అని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ద్వారానే స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌబ్రాతృత్వం, సామాజిక, ఆర్థిక, రాజకీయాల్లో సమాన అవకాశాలు కలుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాడుతున్న రాహుల్ గాంధీ పట్ల కక్ష సాధింపునకు పాల్పడుతున్న బీజేపీ అని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి మద్దతుగా దేశ ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాహుల్ గాంధీకి మద్దతుగా మంచిర్యాలలో లక్ష మందితో జై భారత్ సత్యాగ్ర సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జై భారత్ సత్యాగ్ర సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రావడం మనందరి అదృష్టంగా భావిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.
JC Prabhakar Reddy Emotional: జేసీ ప్రభాకర్ రెడ్డి కంటతడి..!