Lover Attack: ప్రేమ అనేది మాటల్లో చెప్పలేని మధురమైన అనుభూతి. అందుకే ప్రేమించడం, ప్రేమించబడడం ఒక వరం లాంటిదన్నారు. రెండు మనసుల కలయికే ప్రేమ. ప్రేమ ఏ క్షణంలో పుడుతుందో ఎవరూ చెప్పలేరు. చాలా మంది ప్రేమను చాలా రకాలుగా నిర్వచిస్తారు. కానీ నేడు ప్రేమకు అసలు అర్థం మోసమే అన్న రీతిలో పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే ప్రేమ అనే పేరును ఆయుధంగా చేసుకుని అవసరాలు తీర్చుకుంటూ ఎందరో యువతులు మోసపోతున్న ఘటనలు నేటి రోజుల్లో వెలుగు చూస్తున్నాయి. చాలా మంది మంచి వ్యక్తులుగా పరిచయం చేసుకోవడం, ఆ తర్వాత వారిని ప్రేమిస్తున్నట్లు నటించడం వంటి పనులు చేస్తున్నారు. ఇద్దరి మధ్యలో మనస్పర్థలు రావడంతో విడిపోవడం వంటి కథనాలు మనం ఎన్నో చూస్తున్నాము.
అయితే.. కొందరు సినిమాలో చూపించే ప్రేమే మనజీవితంలోకూడా దొరుకుతుందని ఆశపడటం అవివేకం. 2.30 గంటల సినిమా జీవితాన్ని ఊహించుకుని మన జీవితమంతా ప్రేమలో బతికేయొచ్చు అనుకోవడం మూర్ఖత్వానికి నిదర్శనం. ప్రేమ మంచిదే.. ప్రేమించబడడం మంచిదే కానీ ఒకరినొకరు అర్థం చేసుకోలేక విడిపోయి మళ్లీ కలవాలనుకోవడం అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. దీంతో అటు కలవలేక, ఇటు మర్చిపోలేక చెడు తిరుగుల్లు, మద్యానికి బానిసవుతుంటారు. మద్యం సేవించి ఏం చేస్తున్నారో వారికే అర్థం కానీ రీతిలో ప్రవర్తిస్తూ.. వారే కాకుండా వారి చుట్టుపక్కల వున్నవారినికూడా ఇబ్బందికి గురిచేస్తుంటారు. మరొ కొందరైతే మాజీ ప్రేయసి ఇంటికి వెళ్లి నానా రచ్చ చేస్తుంటారు.
ఇక తాజా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది. ఇద్దరు ప్రేమించుకున్న జంట ఎందుకు విడిపోయారో తెలియదు. ఇద్దరి మధ్య మాటలు లేవు. అయితే ప్రియుడు లలిత్ సెహ్ గల్ ఫుల్ గా మద్యం సేవించి మత్తులో జూబ్లీహిల్స్ లోని ప్రియురాలి ఇంటికి వచ్చాడు. తలుపులు బాది ఆమెను అసభ్య పదజాలంతో దూషించాడు. ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. కుటుంబ సభ్యులు గమినించి లలిత్ సెహ్ గల్ పక్కకు నెట్టిన వినకుండా ఆమెపై దాడి చేసేందుకు వెళ్లాడు. అయితే ప్రియురాలి కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటా హుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు లలిత్ సెహ్ గల్ ను అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Kodali Nani: ఏం చేశావు బాబు..? నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది కూడా నేను, జూ.ఎన్టీఆరే..