BRS Chalo Medigadda: చలో మేడిగడ్డకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సు టైరు ఒక్కసారిగా పగిలింది. దారిలోనే బీఆర్ఎస్ నేతలు వెళుతున్న బస్సు ఆగిపోయింది. ఈ ఘటనతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భయాందోళనకు గురయ్యారు. బస్సులో కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు ఉన్నారు. ఈ ఘటన స్టేషన్ ఘన్ పూర్ సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న మిగిలిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు స్థానికంగా ఉన్న మెకానిక్‌ను పిలిపించిన నేతలు సమీపంలోని టైరును మార్పించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారు.
Read also: Mantralayam : కార్యకర్తల మృతి పార్టీ కీ తీరని లోటు : టీడీపీ నేత పాలకుర్తి తిక్కారెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు వెలికి తీసేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ మేడిగడ్డలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల బృందం పర్యటనకు బయలుదేరింది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో పార్టీ ఎమ్మెల్యేలు, శాసనమండలి, పార్లమెంట్ సభ్యులు, ఇతర ముఖ్య నేతలు మేడిగడ్డకు బయలుదేరారు. వారితో పాటు నీటిపారుదల నిపుణులు కూడా ఉన్నారు. మేడిగడ్డ పరీక్ష అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలించేందుకు వెళ్లనున్నారు. అక్కడ అన్నారంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబడుతుంది. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడదామని, వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని బీఆర్ఎస్ ఇవాల చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టింది. అయితే నేతలు వెళుతున్న బస్సు ట్రైర్ పగలడంతో అప్పమత్తమైన డైవర్ చాకచక్యంగా బస్సును పక్కకు ఆపాడు. దీంతో ఎవరికి ఏమీ కాలేదు. అయితే బీఆర్ఎస్ బస్సు టైరు పగలడంతో కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఇక షెడ్డుకు వెళ్ళాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు.
MLA Lasyana Nditha: లాస్య నందిత కేసులో ట్విస్ట్.. టిప్పర్ లారీ డ్రైవర్ అరెస్ట్