Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జోష్ పెంచుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రనేడు కోప్పోలులో ముందుకు సాగనుంది. నేటితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర 101వ రోజుకు చేరుకుంది. నేడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం కోప్పోలు గ్రామంలో ఉదయం 8 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. నకిరేకల్ నియోజకవర్గం భీమవరం గ్రామం మీదుగా సూర్యపేట్ నియోజకవర్గం ఏదులావారి గూడేంలోకి పాదయాత్ర కొనసాగనుంది. కొప్పోలు, భీమవరం, ఏదుల్లావారిగూడెం, కుసుమవారిగూడెం, సైనిక్ పురి కాలనీ గ్రామాల వరకు కొనసాగుతుంది భట్టి పాదయాత్ర సాగనుంది. భీమవరంలో ఈ రోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుందని పార్టీ శ్రేణులు తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర బృందం సైనిక్ పురి కాలనీలో బస చేయనున్నారు.
Read also: Film Nagar Crime: ఫిల్మ్ నగర్‌లో విషాదం.. నాగేళ్ల కుమారున్ని ఉరివేసిన తల్లి.. ఆతరువాత!
భట్టి విక్రమార్క పాదయాత్ర నిన్నటితో వందరోజుల పూర్తి చేసుకుంది. నిన్న నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో భట్టి పాదయాత్ర కొనసాగుతుంది. భట్టి పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెళ్లివిరిసింది. భట్టి విక్రమార్క పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం ఉప్పల్ పాడు గ్రామంలో పాదయాత్ర శిబిరం వద్ద కేక్ కటింగ్ చేసి, బాణా సంచాకాల్చి సంబరాలు చేసుకున్నారు పార్టీ శ్రేణులు. కేతేపల్లి ప్రజలు భట్టికి శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలికారు. భట్టి విక్రమార్క పాదయాత్ర 100వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు #PeopelsMarch100Days అనే హ్యష్ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ అయ్యింది. భట్టి పాదయాత్రకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ని ఒడిదుడుకుల ఎదురైనా పాదయాత్రతో ముందుకు సాగుతున్న భట్టి విక్రమార్కను అభినందించారు. ట్విట్టర్ వేదికగా రాజకీయ నాయకులు, ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు భట్టి విక్రామార్కకు పొగడ్తలతో ముంచెత్తారు.
Cheteshwar Pujara: భారత జట్టులో దక్కని చోటు.. చెతేశ్వర్ పుజారా కీలక నిర్ణయం!