Bhatti Vikramarka : హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాజ్యసభలో బలం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తుచేశారు. “తెలంగాణ వచ్చాక పదేళ్లు ఒక కుటుంబం కోసమే పరిపాలన సాగింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యం యువతకు ఉద్యోగాలు కల్పించడంపై దృష్టి పెట్టింది” అని అన్నారు.
ఇప్పటికే గ్రూప్-1 ఉద్యోగాలు ఇవ్వగా, ఇప్పుడు గ్రూప్-2 నియామక పత్రాలు అందజేస్తున్నామన్నారు. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం సంకల్పానికి ప్రతీక అని చెప్పారు. “పదేళ్లు అధికారంలో ఉన్న వారు ఇలాంటి నియామకాలు చేయలేకపోయారు. మేము చేయకుండా అడ్డంకులు సృష్టించారు. అయినా యువత నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం” అని భట్టి పేర్కొన్నారు. “ఇవాళ మేము ఇస్తున్నవి కేవలం నియామక పత్రాలు కావు, నిరుద్యోగ యువకుల తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచే పత్రాలు” అని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా, కార్పొరేట్ రంగాల్లో కూడా అవకాశాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
Redmi K90 Pro Max: రెడ్మి కె 90 ప్రో మాక్స్ డిజైన్ అదిరింది.. పవర్ ఫుల్ ఫీచర్లతో వచ్చేస్తోంది