ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత వినే ఉంటాము..

అంటే.. దాని అర్థం ఉల్లితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అర్థం

చలికాలంలో ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఓ వరం. ఉల్లిపాయలు జ్వరం వల్ల వచ్చే నొప్పులను తగ్గిస్తుంది.

ఉల్లిపాయల రసం శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గిస్తుంది.

ఉల్లి.. హానికర బ్యాక్టీరియా నుంచి చర్మాన్ని రక్షించడానికి, సహజత్వాన్ని కాపాడుతుంది.

ఉల్లిలోని సల్ఫ్యూరిక్‌ సమ్మేళనాలు పొడి గొంతు నుంచి ఉపశమనం కల్పిస్తాయి.

ఉల్లితో చేసిన వంటలను తరచూ తింటే నోరు పరిశుభ్రంగా మారుతుంది.

ఉల్లిపాయల్లో యాంటీ ఇన్‌ఫమేటరీ, యాంటీ బాక్టీరియల్‌ గుణాలు షుష్కలంగా ఉంటాయి.

ఉల్లి వివిధ రకాల వ్యాధులకు కారణమయ్యే టాక్సిన్‌ లపై బలంగా పోరాడుతుంది