శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెస్ట్ స్కైట్రాక్స్ అవార్డు దక్కిందని జీఎంఆర్ ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ 100 ఎయిర్‌పోర్టుల్లో 64స్థానం నుంచి 63కి చేరుకుందని తెలిపారు. దేశంలోపాటు దక్షిణాసియాలో అత్యుత్తమ సిబ్బంది కలిగిన విమానాశ్రయంగా కూడా పేరొచ్చిందన్నారు. బెస్ట్ రీజనల్ ఎయిర్‌పోర్టు ఆన్ ఇండియా అండ్ సౌత్ ఆసియా-2022లో రెండవస్థానం, క్లీనెస్ట్ ఎయిర్‌పోర్టు ఆన్ ఇండియా అండ్ సౌత్ ఆసియాలో 4వ స్థానం అవార్డులను ఫ్రాన్స్‌లోని ప్యారిస్ ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్‌పోలో జరిగిన సమావేశంలో జీఎంఆర్ ప్రతినిధులు అందుకున్నట్లు తెలిపారు.
ఎయిర్ పోర్ట్ సిఈఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక అవార్డును హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పని సహకారం, మద్దతు లేకుండా ఈ అవార్డు సాధ్యమయ్యేది కాదు. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొంటున్న సమయంలో ‘ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్’ అనే నినాదంతో మా సిబ్బంది అచంచలమైన అంకితభావం, నిబద్దతతో, ప్రతి ప్రయాణీకుని పట్ల జాగ్రత్త వహించారు. మా భాగస్వాములందరూ ఒకే లక్ష్యంతో ప్రయాణీకుల కోసం పనిచేశారు. ఇప్పుడు మళ్లీ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రయాణికులకు చిరస్మరణీయమైన అనుభవాన్ని అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాము అన్నారు.
Avesh Khan: నా అద్భుత ప్రదర్శనను నాన్నకు అంకితమిస్తున్నా..