శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెస్ట్ స్కైట్రాక్స్ అవార్డు దక్కిందని జీఎంఆర్ ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ 100 ఎయిర్‌పోర్టుల్లో 64స్థానం నుంచి 63కి చేరుకుందని తెలిపారు. దేశంలోపాటు దక్షిణాసియాలో అత్యుత్తమ సిబ్బంది కలిగిన విమానాశ్రయంగా కూడా పేరొచ్చిందన్నారు. బెస్ట్ రీజనల్ ఎయిర్‌పోర్టు ఆన్ ఇండియా అండ్ సౌత్ ఆసియా-2022లో రెండవస్థానం, క్లీనెస్ట్ ఎయిర్‌పోర్టు ఆన్ ఇండియా అండ్ సౌత్ ఆసియాలో 4వ స్థానం అవార్డులను ఫ్రాన్స్‌లోని ప్యారిస్ ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్‌పోలో జరిగిన సమావేశంలో జీఎంఆర్…