ఓ వ్యక్తి చనిపోవడంతో అతడి అంతిమయాత్రను నిర్వహించారు కుటుంబీకులు. అయితే.. ఇంటి నుంచి స్మశానం వరకు డప్పుచప్పుళ్లతో బాణసంచాలు కాల్చుతూ సదరు వ్యక్తి భౌతికకాయాన్ని తీసుకువెళ్తున్నారు బంధువులు. అయితే.. అంతిమయాత్ర ఊరేగింపు కొనసాగుతుండగా.. బాంబులు పేల్చడంతో.. అక్కడ సమీపంలో ఉన్న తేనెతెట్టుకు తగిలింది. ఇంకేముంది.. ఆ తేనెతెట్టుకున్న తేనటీగలు ఒక్కసారిగి అంతిమయాత్ర ఊరేగింపులో ఉన్న జనాలపై దాడి చేయడం ప్రారంభించారు. దీంతో.. అంతిమయాత్రలోని మృతదేహాన్ని రోడ్డుపైనే వదిలేసి బంధువులు తలోవైపు పరుగులు తీశారు.
వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెంలో రుద్రారపు వీరస్వామి అనే వ్యక్తి చనిపోగా అంతిమయాత్రలో పేల్చిన బాంబుల కారణంగా తేనెటీగల దాడి చేశాయి. దీంతో.. తేనెటీగల దాడితో.. శవాన్ని వదిలేసి పరుగులు తీశారు బంధవులు. అయితే.. ఈ తేనెటీగల దాడిలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తేనెటీగలు వెళ్లిపోయాక యధావిథిగా అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించారు. కానీ.. ఈ సారి బాంబులు మాత్ర పేల్చలేదు.