కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీ లో ఎలుగుబంటి కలకలం సృష్టిస్తోంది. యూనివర్సీటీ తిరుగుతూ అందరినీ హడలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ లోని ఎంబీఏ కాలేజీ ముందు ఉన్న పూల కుండీలు ఎలుగు బంటి పగలకొట్టి వెళ్లింది. కొత్తపల్లి మండలం మల్కాపూర్ శివారులో ఓ ఇంటి వద్ద ఎలుగుబంటి తిరగడంతో గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడి నుండి మార్క్ ఫెడ్ గోదాముల ఆవరణలోకి ప్రవేశించి శాతవాహన క్యాంపస్ లోని చిట్టడివిలోకి ఎలుగుబంటి వెళ్లింది.
Chintamaneni Prabhakar : కోడిపందాల్లో టీడీపీ నేత చింతమనేని.. పోలీసులను చూసి పరార్..
అయితే.. గత ఆరు నెలలుగా శాతవాహన యూనివర్సిటీలోనే ఎలుగుబంటి తిరుగుతున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఎలుగుబంటి కదలికలతో శాతవాహన యూనివర్సిటీ లో విద్యార్థుల సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థులు సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు రావద్దని శాతవాహన యూనివర్సిటీ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. అయితే ఇప్పటికే.. యూనివర్సిటీ కి చేరుకున్న అటవీ సిబ్బంది.. ఎలుగుబంటి కోసం రెస్క్యూ టీమ్ తో వెతుకులాట కొనసాగిస్తున్నారు.