అడవుల్లో వుండాల్సిన మృగాలు జనసంచారంలోకి వస్తుండటంతో.. జనాల్లో భయం ఏర్పడుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్లు బిక్కు బిక్కు మంటూ ప్రాణం గుప్పిట్లో పట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయంతో జంకుతున్నారు. ఈమధ్యకాలంలో అడవుల్లో చెట్లను నరకడం, అడవుల్లోనే జనాలు జీవనం కొనసాగిస్తున్నారు. దీంతో ఆహారం కోసం పాములు, పులులు, ఎలుగుబంటి, ఏనుగులు మొదలగు మృగాలు జన సంచారం చేసే గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలపై దాడి చేస్తున్నాయి. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
తాజాగా జనగామ జిల్లా పాలకుర్తి ఎస్సీకాలనీలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపిండి. లక్ష్మీనారాయణపూరం గ్రామశివారు పొలాల నుండి పాలకుర్తికి వచ్చినట్టు ఆనవాల్లు కనిపించడంతో.. గ్రామస్తుల్లో భయం నెలకొంది. ఎస్సీకాలనీ మెయిన్ రోడ్డు దగ్గర డివైడర్ దాటి కాలనీలోపలికీ వెళ్తుండగా చూసిట్లు పాలకుర్తి ఎస్సీకాలనీవాసులు తెలిపారు. సెల్ ఫోన్ లో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు వీడియో తీయడంతో.. స్థానికులు భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్నారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపడంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులు హెచ్చరికలు జారీ చేసారు. ఎలుగుబంటి పాదముద్రలను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అఖిలేష్ సేకరించి ఎలుగుబంటిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
read also: BJP Telangana Organizational General Secretary : కొత్త సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఎవరు..?
జూన్ 23, 2021లో హాంకాంగ్‌లోని క్వారీబే మెట్రోస్టేషన్‌లోకి సమీపంలోని అడవిలోనుంచి ఓ అడవి పంది వచ్చింది. టక్కెట్ కౌంటర్ సందులో నుంచి లోనికి ప్రవేశించిన ఆ అడవి పంది రైలు ఎక్కేసింది. బోగీలన్నీ దర్జాగా తిరిగింది. ఓ సీటు చూసుకొని గమ్మున పడుకొని కునుకు తీసింది. ఆ తరువాత రైలు దిగి మరో రైలు ఎక్కింది. రైలు ఎక్కిన తరువాత స్టేషన్‌కు చేరుకోగానే, అధికారులు దానిని పట్టుకొని అడవిలో వదిలేశారు. హాంకాంగ్ దేశంలో దట్టమైన అడవులు అనేకం ఉన్నాయి. దీంతో అక్కడ అడవిపందులు అప్పుడప్పుడు అడవిని వదిలి రోడ్డుమీదకు వస్తుంటాయి. వీటి వలన ఒక్కోసారి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. అడవిపందులు ఎక్కువగా ఉన్నప్పటికీ వీటికి అక్కడి ప్రజలు పెద్దగా హాని కలిగించరు.
Rashtrapatni Comments: కాంగ్రెస్ లో రచ్చకు దారితీసిన” రాష్ట్రపత్ని” వ్యాఖ్యలు..