CM Revanth Reddy : రిజర్వేషన్లు ఇవ్వకపోతే మోడీని గద్దె దించుతాం
- రాష్ట్రపతి వద్ద నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లులు
- అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆవేదన
- రాహుల్ గాంధీ సూచనలతో కులగణన, 42% బీసీ కోటా సాధనలో కాంగ్రెస్ పోరాటం
- బీసీ బిల్లును ఆమోదించకపోతే మోడీని గద్దె దింపుతాం : సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, “బీసీ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే మోడీని గద్దె దించుతాం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లుపై చర్చ జరగాలని కోరుతూ, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కేంద్రం వెంటనే ఆమోదించాలని రేవంత్ డిమాండ్ చేశారు. “బీసీ కోటా బిల్లులు కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగు నెలలుగా రాష్ట్రపతి దగ్గర కూడా ఈ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అపాయింట్‌మెంట్ ఇవ్వమని కోరినా, రాష్ట్రపతి ఇప్పటివరకు సమయం కేటాయించలేదు,” అని ఆయన విమర్శించారు.
Salman khan : సెట్‌లో నటిని బెదిరించిన సల్మాన్.. ఇంతలోనే ఎంటరైన మీడియా !
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
టెలంగాణలో కులగణన చేపట్టడం రాహుల్ గాంధీ సూచన మేరకే జరిగిందని రేవంత్ తెలిపారు. “రాహుల్ గాంధీ ఆశయం ప్రకారం 42 శాతం బీసీ కోటా బిల్లు తెచ్చాం. ఈ కోటా సాధించే వరకు పోరాటం కొనసాగిస్తాం,” అని స్పష్టం చేశారు. కేంద్రం బిల్లులను ఆమోదించాలని డిమాండ్ చేస్తూ, ఆగస్టు 6న జంతర్ మంతర్ దగ్గర మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు, పార్టీలోని బీసీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు, బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!